అర్జెంటుగా తమ పార్టీకి చెందిన ఆస్తిపాస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి .ఏ స్థితిలో ఉన్నాయి.
ఎవరి చేతుల్లో ఉన్నాయి ఇలా అనేక అంశాలపై ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్న ఆస్తుల వివరాలను సేకరించే పనిలో ఏఐసీసీ నిమగ్నమైంది.
ఈ మేరకు తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ తన ఆస్తులను లెక్క చూసుకునే పనికి శ్రీకారం చుట్టింది.దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆస్తుల గురించి కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేకంగా దృష్టి పెట్టిన నేపథ్యంలో, తెలంగాణలో ఉన్న పార్టీ ఆస్తుల లెక్కలు తేల్చేందుకు తెలంగాణ కాంగ్రెస్( Telangana Congress ) సిద్ధమవుతోంది.
ఈ మేరకు గాంధీభవన్ నుంచి మండల స్థాయి లేదా రెవెన్యూ డివిజన్ లేదా జిల్లా స్థాయిలో పార్టీకి కార్యాలయాలు ఉన్నాయా ? ఆ కార్యాలయాలు ఎవరి పేరుతో ఉన్నాయి ? ఆ కార్యాలయాల ద్వారా వస్తున్న ఆదాయం సక్రమంగా వినియోగం అవుతుందా లేదా ఇలా అనేక వివరాలను సేకరించబోతున్నారు.

తెలంగాణ కాంగ్రెస్ కు హైదరాబాద్ తో పాటు, రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో, పలు రెవెన్యూ డివిజన్ లలో పార్టీ సొంత కార్యాలయాలు ఉన్నాయి. రాష్ట్ర పార్టీ కార్యాలయమైన గాంధీ భవన్ ను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే నిర్మించినప్పటికీ , మాజీ ప్రధాని పీవీ నరసింహారావు( P.V.Narasimha Ra ) హయాంలో ఓ ట్రస్ట్ ను ఏర్పాటు చేసి యాజమాన్య హక్కులు ఆ ట్రస్ట్ కు అప్పగించారు.గాంధీభవన్ ను వినియోగించుకున్నందుకు ఈ ట్రస్ట్ కు నెలకు నామమాత్రపు అద్దెను కూడా పార్టీ చెల్లిస్తోంది.
అలాగే తెలంగాణ వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల్లో ఉన్న కార్యాలయాలు అనేకమంది వ్యక్తులు, ట్రస్టు పేరుతో ఉన్నాయి .ఖమ్మం , కరీంనగర్ పార్టీ కార్యాలయాల విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకపోయినా , వరంగల్ జిల్లాలోని పార్టీ కార్యాలయాన్ని ఇతర వ్యక్తులు ట్రస్టీల రూపంలో నిర్వహిస్తున్నారు .అలాగే ఈ కార్యాలయం నుంచి వచ్చే ఆదాయాన్ని వారే తీసుకుంటున్నారు.ఇక భద్రాచలంలో ఉన్న పార్టీ కార్యాలయంలో ఓ వ్యక్తి కంప్యూటర్ సెంటర్ సొంతంగా నిర్వహిస్తున్నారట.

ఇలా రాష్ట్రవ్యాప్తంగా పార్టీ ఆస్తులు ఎవరెవరు చేతుల్లో ఉన్నాయి ? వాటి ఆదాయ , వ్యయాల వివరాలు అన్ని సమగ్రంగా తెలంగాణ కాంగ్రెస్ సేకరిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ సింగ్( Digvijaya Singh ) నేతృత్వంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆస్తులు, వివరాల సేకరణ కోసం ప్రత్యేక దృష్టి సారించారు.

తెలంగాణలోని పార్టీ ఆస్తుల వివరాలను సేకరించేందుకు గాను ఏఐసీసీ నుంచి కుంబల్కర్ ను ఇన్చార్జిగా నియమించారు.త్వరలోనే తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి కమిటీని ఏర్పాటు చేయబోతున్నారు.ఈ కమిటీని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించబోతున్నారు.