ఇండియాలో పెరిగిన జనాభా... జర్మనీలో గుబులు పుట్టిస్తోందా?

తాజాగా భారత్ ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంగా ఉద్భవించింది.దీనిని ఐక్యరాజ్యసమితి కూడా అధికారికంగా ప్రకటించిన సంగతి విదితమే.ఈ క్రమంలో చైనా ( China )తన అక్కసుని చేతకాని మాటలతో వెళ్లగక్కింది.‘జనాభా పెరగడం ముఖ్యం కాదు, క్వాలిటీ ముఖ్యం’ అంటూ తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తోంది.నిజానికి చైనాతో పోల్చితే భారత్ ( India )లోనే యువతరం ఎక్కువ.ఇరుగు పొరుగు బాగుంటేనే ఇల్లు చల్లగా ఉంటుందని ఒక నానుడి.కానీ దురదృష్టకరం.మన దేశం చుట్టూ ఉన్న పొరుగు దేశాలు మన కీడుని కోరుకునే వాళ్లే.

 India Increased Population Is Germany Growing , India Papulation ,germany , Chin-TeluguStop.com

పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్( Pakistan Jammu and Kashmir ) మాదంటే మాదని కొన్ని దశాబ్దాలపాటు నుండి మనతో కయ్యానికి కాలు దువ్వుతుంటే, చైనా కూడా కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది.ఇక శ్రీలంక విషయానికొస్తే తమిళ జాలర్ల మీద దాడి చేస్తూ ఉంటుంది.మయన్మార్ కూడా అంతే.ఇక బంగ్లాదేశ్ సరిహద్దుల్లో తన జనాభాను మనదేశంలోకి దొంగచాటున పంపిస్తూ ఉంటుంది.ఇలా చెప్పుకుంటూ ఇండియాకి పొరుగు దేశాలతో ఎన్నో సమస్యలు వున్నాయి.ఇలా ఆయా దేశాలు ఎన్ని ఘోరమైన చర్యలకు పాల్పడినా భారత్ ఆదేశాల మీద కోరి ఎప్పుడూ దండెత్తిన దాఖలాలు లేవు.

కానీ అక్కసుతో ఆ దేశాలు చేసే కుట్రలకు భారత్ నాటినుండి నేటికీ ఇబ్బంది పడుతూనే ఉంది.

ఈ క్రమంలోనే తాజాగా వాటి వరుసలోకి జర్మనీ ( Germany )చేరింది.విషయం ఏమంటే అత్యధిక జనాభా ఉన్న దేశంగా భారత్ ఆవిర్భవించడమే దానికి కారణం.భారత్ అంటే చైనాకు కోపం కాబట్టి, జర్మనీకి కూడా ఇపుడు ఈ విషయం మింగుడు పడడం లేదు.

ప్రపంచంలోనే భారత్ అత్యధిక జనాభా ఉన్న దేశంగా ఆవిర్భవించిన నేపథ్యంలో జర్మనీ ఈ విషయాన్ని చులకన చేస్తూ ఒక పత్రిక కార్టూన్ ప్రచురించింది.కాగా ఇప్పుడు ఇది తీవ్ర చర్చనీయాంశమైంది.

దీనిని హేళన చేస్తూ జర్మనీ దేశానికి చెందిన మేగజైన్ ‘డేర్ స్పీజెల్’ ఒక కార్టూన్ ను ప్రచురించింది.చైనా బుల్లెట్ రైలు, భారతదేశానికి చెందిన సాధారణ రైలును దాటి వెళుతున్నట్టు చిత్రీకరించింది.

కాగా దీనిపైన మనవాళ్ళు అంతే ధీటుగా కౌంటర్లు వేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube