కమ్యూనిస్టు పార్టీలతో పొత్తులపై తెలంగాణ కాంగ్రెస్ కటీఫ్ చెప్పిందని తెలుస్తోంది.కమ్యూనిస్టులకు కేటాయించాలనుకున్న సీట్లకు సైతం ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో పడింది.
పొత్తుల నేపథ్యంలో సీపీఐకి కొత్తగూడెం, చెన్నూరు టికెట్లు మరియు సీపీఎంకు మిర్యాలగూడ, వైరా స్థానాలు ఇవ్వాలని కాంగ్రెస్ భావించింది.అయితే ప్రస్తుతం సీట్ల కేటాయింపుపై కాంగ్రెస్ వెనక్కి తగ్గిందని తెలుస్తోంది.
ఈ మేరకు కమ్యూనిస్టులతో పొత్తు లేకుండా బరిలోకి దిగాలని కాంగ్రెస్ యోచిస్తోందని సమాచారం.ఇందులో భాగంగా కొత్తగూడెం బరిలో మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావును నిలబెట్టాలనుకుంటున్న కాంగ్రెస్ నేతలు ఆయనతో చర్చలు జరుపుతున్నారు.
అటు చెన్నూర్ నుంచి వివేక్ తనయుడు వంశీతో పాటు సీపీఎంకు కేటాయించాలనుకున్న రెండు నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులను నిలిపేందుకు ప్రయత్నాలు చేస్తుంది.ఈ క్రమంలో మిర్యాలగూడ నుంచి బత్తుల లక్ష్మారెడ్డి, వైరా నుంచి పొంగులేటి వర్గం నేత విజయభాయిని నిలబెట్టాలని భావిస్తోందని తెలుస్తోంది.
కాగా కమ్యూనిస్టులతో కాంగ్రెస్ పొత్తు ఉంటుందా ? లేదా? అన్నది ఇవాళ్టితో తేలిపోనుందని సమాచారం.