ఆ పదవుల విషయంలో కేసీఆర్ సంచలన నిర్ణయం ? 

తెలంగాణలో ఎదురులేకుండా పార్టీని, ప్రభుత్వాన్ని పరుగులు పెట్టిస్తున్న సీఎం కేసీఆర్ ఎప్పుడూ ఏదో ఒక సంచలన నిర్ణయం తీసుకుంటూనే అందరికీ షాక్ ఇస్తూ ఉంటారు.

ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల పై ప్రధానంగా దృష్టి సారించిన కేసీఆర్, ఈ ఎన్నికల్లో తప్పకుండా టిఆర్ఎస్ జెండా రెపరెప లాడించాలని చూస్తున్నారు.

ఈ మేరకు పార్టీ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు.దీనిలో భాగంగా పార్టీలో మొదటి నుంచి కష్టపడి పనిచేస్తున్న నాయకులు చాలామంది తమకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదని, పదవులు మొత్తం కొంతమందికి పరిమితమైపోతున్నాయని, దీని కారణంగా ఉద్యమ సమయంలో నుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉన్న వారిలో అసంతృప్తి తీవ్రంగా పెరిగిపోతుందని ఇలా ఎన్నో విషయాలను కేసీఆర్ గుర్తించారు.

అది కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారికి పార్టీలో కీలక పదవులు అప్పగించడంతో సొంత పార్టీ నాయకులు అసంతృప్తి పెరిగిపోయిందని, ఇలా అనేక విషయాలు కేసీఆర్ తెలుసుకున్నారు.దీని కారణంగా రానున్న రోజుల్లో మరింత గా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనే అభిప్రాయంతో ఇప్పుడు పార్టీలో మార్పులు చేర్పులు చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

తెలంగాణ కోసం టిఆర్ఎస్ ఉద్యమ సమయంలో అనేక కష్టాలు నష్టాలు ఎదుర్కొని, పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న వారికి ఈ సారి పార్టీ పదవుల్లోనూ, ప్రభుత్వ పదవుల్లోనూ ప్రాధాన్యం ఎక్కువగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారట.

Advertisement

అలాగే రానున్న గ్రేటర్ ఎన్నికల్లోనూ సీట్లు పాత వారిని కాదని, కొత్తవరికి అవకాశం కల్పించే దిశగా కేసీఆర్ఆ లోచిస్తున్నారట.ఇక పదేళ్లుగా పార్టీ పదవులు అనుభవిస్తున్న వారిని పక్కకు తప్పించి ,మొదటి నుంచి పార్టీ కోసం కష్ట పడిన వారికి ప్రాధాన్యం పెంచే దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారు.అయితే ఇదే విషయం కేసీఆర్ తనయుడు మంత్రి కేటీఆర్ సైతం పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రతి నియోజకవర్గంలోనూ పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నాయకులు ఎవరు ? ఇప్పటి వరకు పార్టీ పదవులు దక్క పోవడానికి కారణాలు ఏంటి ? ఏ నియోజకవర్గం లో ఎంతమంది అటువంటి నాయకులు ఉన్నారు ? ఇలా అనేక విషయాలను పరిగణలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.మొత్తంగా చూస్తే ప్రజా వ్యతిరేకతను తగ్గించుకోవడంతో పాటు, పార్టీ నాయకుల్లో అసంతృప్తిని చల్లార్చేందుకు కేసీఆర్ ఈ తరహా సంచలన నిర్ణయం తీసుకోవడంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

కడప ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు..!!
Advertisement

తాజా వార్తలు