కీలక నిర్ణయాలు తీసుకున్న తెలంగాణా క్యాబినెట్..!

ఆదివారం ప్రగతిభవన్ లో సీఎం కే.సి.

 Telangana Cabinet Meeting Pragathi Bhavan , Cm Kcr, Kcr, New Hospitals, Pragathi-TeluguStop.com

ఆర్ అధ్యక్షతన తెలంగాణ క్యాబినెట్ మీటింగ్ జరిగింది.ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది.

వైద్య, ఆరోగ్య అంశాలపైన చర్చ జరిగినట్టు సమాచారం.రాష్ట్రం లో కొత్తగా ఏర్పరిచే ఐదు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పై మంత్రి మండలి సమావేశంలో  చర్చించింది.

హాస్పిటల్స్ సత్వర నిర్మాణం గురించి కే.సి.ఆర్ అడిగి తెలుసుకున్నారు.వీటి కోసం శంకుస్థాలనం చేయాలని కే.సి.ఆర్ ఆదేశించారు. వరంగల్ తో పాటుగా చెస్ట్ హాస్పిటల్ ఏరియా, టిమ్స్, ఏల్బీ నగర్ గడ్డి అన్నారం, అల్వాల్ లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ చేపట్టాలని కే.సి.ఆర్ ఆదేశించారు.

సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్నిటిని ఇకపై తెలంగాణ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) అని నామకరణం చేయనున్నారు.

సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో వైద్యసేవలను అన్ని ఒక్కచోట జరిగేలా చేయాలని నిర్ణయించారు.మంజూరైన మెడికల్ కాలేజీలను వచ్చే అకడెమిక్ ఇయర్ నుండి ప్రారంభించాలని అందుకు కావాల్సిన సదుపాయాలు, కాలేజీలు, హాస్టల్స్ నిర్మాణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

రాబోయే రోజుల్లో అనుమతించే మెడికల్ కాలేజీల స్థలాల కేటాయింపుల గురించి వైద్యాధికారుల ముందస్తు చర్యలకు కే.సి.ఆర్ ఆదేశం.పటాన్ చెరువులో కార్మీకులకు, ప్రజా అవసరాల కోసం కొత్తగా ఒక మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ మంజూరు చేసేలా నిర్ణయం తీసుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube