ప్రస్తుతం తెలంగాణలో బిజెపి లో ఎక్కడ లేని ఉత్సాహం కనిపిస్తోంది.తెలంగాణలో అధికారం సాధించేది తామే అనే ధీమా వ్యక్తం చేశారు.
ముఖ్యంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లో ధీమా పెరిగినట్టుగా ప్రస్తుతం వ్యవహారం కనిపిస్తూ ఉండగా , తాజాగా సంజయ్ అనేక సంచలన వ్యాఖ్యలు చేశారు.గత కొంతకాలంగా బిజెపి కనుక తెలంగాణలో అధికారంలోకి వస్తే, ముఖ్యమంత్రి గా బండి సంజయ్ ప్రమాణ స్వీకారం చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ వ్యవహారంపై పార్టీ నాయకులలోను అంతర్గతంగా విభేదాలు తలెత్తుతూ, రాజకీయాలు చోటు చేసుకుంటూ వస్తూ ఉండడం వంటి వ్యవహారాలతో తాజాగా బండి సంజయ్ స్పందించారు.
ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక అంశాలపై క్లారిటీ ఇచ్చారు తాను అసలు సీఎంను కాబోనని , తణుకు.
తెలంగాణ బిజెపి అభ్యర్థి ని సీఎం చేయడమే తన లక్ష్యమని తాను సీఎం రేసులో లేను అంటూ క్లారిటీ ఇచ్చారు ఇప్పటివరకు ఈ వ్యవహారంలో వస్తున్న వార్తలన్నీ పుకార్లే అని తేల్చి చెప్పారు.తెలంగాణలో రాబోయేది బిజెపి ప్రభుత్వం అనే ధీమా వ్యక్తం చేశారు.
తాను ఎంపీగా గెలవడానికి కెసిఆర్ చేసిన వ్యాఖ్యలు కారణమయ్యాయి అన్నారు.హిందూ గాళ్ళు బొందు గాళ్లు అంటూ కెసిఆర్ చేసిన వ్యాఖ్యలు టిఆర్ఎస్ పై వ్యతిరేకత తీసుకువచ్చారని తనను ఎంపీగా గెలిపించాయి అన్నారు.
తాను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు అయిన తర్వాత తన పై హత్యకు కుట్ర జరుగుతున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.కరీంనగర్ లో తన ఇంటి చుట్టూ కొన్ని టీమ్స్ రెక్కీ నిర్వహించాయన్నారు .

ఓ వ్యక్తి లెదర్ బ్యాగ్స్ అమ్ముతున్నట్లు నటిస్తూ తన ఇంటి చుట్టూ నెలరోజులపాటు తిరిగాడు అని సంచలన ఆరోపణలు చేశారు .తాను యువమోర్చా లో ఉన్నప్పుడే తన మీద హత్యకు కుట్ర జరిగాయని , అప్పటి నుంచి ఇలాంటివి తనకు అలవాతే అని చెప్పుకొచ్చారు.ఇంకా అనేక అంశాలపై సంజయ్ మాట్లాడారు .అయితే సీఎం అభ్యర్థి రేసులో తాను లేనని అంటూ చేసిన ప్రకటన మాత్రం బీజేపీతో పాటు, తెలంగాణ రాజకీయాలలోను చర్చనీయాంశంగా మారింది.







