అక్కడ దేవునికి ఏమి సమర్పిస్తారో తెలిస్తే షాకవుతారు!

ఈ ఆర్టికల్ హెడ్డింగ్ చదివిన తర్వాత ఎవరైనా ఆసక్తి కలుగుతుంది.అక్కడ మహాశివునికి అంటే భోలేనాథునికి చాక్లెట్లతో పాటు మాంసం కూడా సమర్పిస్తారు.

 Would Be Shocked To Know What To Offer God There , Batuk Bhairava Temple In Kash-TeluguStop.com

ఆ మహాదేవుని ఆలయంలో చికెన్, మటన్, చేపలను ప్రసాదంగా అందిస్తారు.ఇది ఆలయంలో ఏ ప్రత్యేక సందర్భంలోనో కాదు.

ప్రతిరోజూ జరుగుతుంది.ఇలాంటి శివుని ఆలయం ఎక్కడ ఉంది? శివుకికి మాంసాహారం ఇవ్వడం వెనుక కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.మన దేశంలోని కాశీలోని ఒక దేవాలయంలో శివునికి నాన్ వెజ్ నైవేద్యంగా పెడతారు.కాశీలోని బతుక్ భైరవ దేవాలయంలో భక్తులు శివునికి నాన్ వెజ్, మద్యాన్ని అందిస్తారు.

అంతే కాకుండా బతుకు భైరవుడికి బిస్కెట్లు, చాక్లెట్లు కూడా సమర్పిస్తారు.భైరవుడికి ఈ ఆహార పదార్థాలు సమర్పించడం ద్వారా కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు.

ఈ ఆలయంలో శివుడు సాత్విక, రాజసిక, తామసిక అనే మూడు రూపాలలో ఉంటాడు.ఇక్కడ శరదృతువులో శివునికి మూడు రూపాలలో ప్రత్యేక అలంకరణ చేస్తారు.

ఉదయం పూట శివుని సాత్విక రూపానికి చాక్లెట్లు, బిస్కెట్లు సమర్పిస్తారు.మధ్యాహ్నం శివునికి రొట్టెలు, పప్పులు, బియ్యం, కూరగాయలను సమర్పిస్తారు.

దీని తరువాత, సాయంత్రం హారతి తర్వాత, భైరవ రూపంలోని శివునికి చేపలు, మటన్, చికెన్‌తో పాటు మద్యాన్ని కూడా సమర్పిస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube