సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీలు ప్రచారం జోరును పెంచాయి.అభ్యర్థులు వినూత్న ప్రచారంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లా టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం వైసిపి అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్ లో దోశలు పకోడీలు వేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.