ప్రస్తుత వేసవికాలంలో విరివిరిగా లభ్యమయ్యే పండ్లలో పనస ఒకటి.పిల్లల నుంచి పెద్దల వరకు పనస పండును ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు.
పనస పండు( Jackfruit ) ఎంతో రుచిగా ఉంటుంది.పైగా బోలెడన్ని పోషకాలను కలిగి ఉంటుంది.
అయితే పనస పండు తినే క్రమంలో లోపల ఉండే గింజలను పారేయడం అందరికీ ఉన్న అలవాటు.కానీ పనస పండు మాత్రమే కాదు పనస గింజలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
పనస గింజల్లో జింక్, ఐరన్, కాల్షియం, కాపర్, పొటాషియం, మెగ్నీషియం, థయామిన్, రిబోఫ్లావిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.అందువల్ల పనస గింజలకు అనేక హెల్ప్ బెనిఫిట్స్ ను చేకూరుస్తాయి.
మరి ఆ బెనిఫిట్స్ ఏంటి.? అసలు పనస గింజలను ఎలా తినాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా ఎంతో మంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు.ముఖ్యంగా చిన్న పిల్లలు, మహిళల్లో రక్తహీనత( Anemia ) అనేది అధికంగా కనిపిస్తుంది.అయితే రక్తహీనతను తరిమి కొట్టగల సత్తా పనస గింజలకు ఉంది.
ఈ గింజల్లో ఐరన్ మెండుగా ఉంటుంది.ఇది ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి పెంచడానికి తోడ్పడుతుంది.
రక్తహీనతను దూరం చేస్తుంది.అలాగే పనస గింజలను( Jackfruit Seeds ) తినడం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి.
పనస గింజల్లో మెగ్నీషియం అధికంగా ఉంటుంది.ఇది కాల్షియం( Calcium ) శోషణను ప్రోత్సహిస్తుంది.
అందువల్ల పనస గింజలను తీసుకుంటే బోన్స్ స్ట్రోంగ్ గా మారతాయి.పనస గింజల్లో ఫైబర్ కూడా ఉంటుంది.
ఫైబర్ జీర్ణక్రియను చురుగ్గా మారుస్తుంది.సాధారణ పేగు కదలికలకు సహాయపడుతుంది.
అంతేకాదు పనస గింజలు అధిక రక్తపోటు( Blood Pressure )ను అదుపులోకి తెస్తాయి.గుండె జబ్బులు వచ్చే రిస్క్ ను తగ్గిస్తాయి.ఇమ్యూనిటీ పవర్ ను పెంచి అనేక రోగల నుంచి సైతం రక్షిస్తుంది.ఇక మరి పనస గింజలను ఎలా తినాలో కూడా తెలుసుకుందాం.పనస గింజలను పచ్చిగా తినకూడదు.ఎందుకంటే వాటిలో చాలా యాంటీ న్యూట్రీషియన్స్ ఉంటాయి.
అవి మనకు హనీ చేస్తాయి.అందువల్ల, పనస గింజలను కాల్చి లేదా ఉడికించి మాత్రమే తీసుకోవాలి.