తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ యంగ్ హీరో తేజ( Young hero Teja ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తేజ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన తేజ సజ్జా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ఇప్పుడు హీరోలుగా రాణిస్తున్న వారిలో తేజ కూడా ఒకరు.
చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ, మహేష్ బాబు ఇలా ఒకప్పటి టాప్ స్టార్లు చాలామందితో స్క్రీన్ షేర్ చేసుకున్న తేజ.ముందుగా ఓ బేబీ లాంటి లేడీ ఓరియెంటెడ్ మూవీలో స్పెషల్ క్యారెక్టర్ చేశాడు.

తర్వాత జాంబి రెడ్డి( Zombie Reddy ) .మూవీతో హీరోగా మారి ఓ మోస్తారు విజయాన్ని అందుకున్నాడు.ఇక అతడి దశ తిరిగేలా చేసింది మాత్రం హనుమాన్ మూవీనే అని చెప్పవచ్చు.ఈ సినిమా ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి తేజ కెరీర్‌నే మార్చేసింది.తేజ తర్వాతి సినిమా కోసం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
అతను హనుమాన్ రిలీజ్ కంటే ముందు ఒప్పుకున్న సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు.ఆ సినిమా పేరు.
మిరాయ్( Mirai ) .కార్తీక్ ఘట్టమనేని రూపొందిస్తున్న చిత్రమిది.మిరాయ్ అనేది జపనీస్ వర్డ్.ఇదొక యాక్షన్ మూవీ అంటున్నారు.ఇందులో మంచు మనోజ్ నెగెటివ్ షేడ్స్ ఉన్న ప్రత్యేక పాత్ర పోషిస్తున్నాడు.

ఈగల్ మూవీను నిర్మించిన పీపుల్స్ మీడియా సంస్థే ( People’s Media company )ఈ చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేస్తోంది.కానీ హనుమాన్ సినిమాతో తేజ మార్కెట్ పెరిగిపోవడం, పాన్ ఇండియా స్థాయిలో అతడికి ఫాలోయింగ్ ఉండడంతో మంచి క్వాలిటీతో పెద్ద స్థాయిలోనే సినిమా తీయాలని ప్రణాళికలు మార్చారట.దీంతో బడ్జెట్ రూ.40 కోట్లకు పెరిగినట్లు సమాచారం.ఇందులో తేజ సరస రితిక నాయక్ నటిస్తోంది.
త్వరలోనే సినిమా ఫస్ట్ లుక్ ను లాంచ్ చేయబోతున్నారు.వేసవి చివర్లో సినిమా రిలీజ్ అవుతుందట.