యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్( Prabhas ) హీరో గా నటించిన ఆదిపురుష్ సినిమా కోసం ఆయన ఫ్యాన్స్ మరియు పాన్ ఇండియా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన విషయం తెల్సిందే.ఆదిపురుష్ సినిమా( Adipurush ) కోసం ఏ స్థాయి లో ప్రేక్షకులు ఎదురు చూశారో అదే స్థాయి లో తేజ హీరో గా ప్రశాంత్ వర్మ( Director Prashanth Varma ) దర్శకత్వం లో రూపొందుతున్న హను మాన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమా ను ఆదిపురుష్ సినిమా విడుదల సమయంలోనే విడుదల చేయబోతున్నట్లుగా హడావుడి చేశారు.ఇప్పుడు సంక్రాంతికి సినిమా ను విడుదల చేయబోతున్నట్లుగా చెబుతున్నారు.

సినిమా( Hanu Man ) కు వచ్చిన హైప్ కారణంగా భారీ ఎత్తున గ్రాఫిక్స్ వర్క్ చేయిస్తున్నారు.సాధారణంగా అయితే ఈ సినిమా ను ఇప్పటికే విడుదల చేయాల్సింది.కానీ సినిమాకు వచ్చిన బజ్ కారణంగా పాన్ ఇండియా రేంజ్ లోనే కాకుండా విదేశాల్లో కూడా భారీ ఎత్తున విడుదల చేయాలనే ఉద్దేశ్యం తో భారీ ఎత్తున వీఎఫ్‌ఎక్స్ పై దృష్టి పెట్టారు.40 కోట్ల రూపాయలను మేకింగ్ కోసం ఖర్చు చేసిన మేకర్స్ ఇప్పుడు అంతకు మించి గ్రాఫిక్స్ వర్క్ కోసం ఖర్చు చేస్తున్నారట.మొదట ఈ సినిమా మేకింగ్ కి 25 కోట్లు, గ్రాఫిక్స్ కి 15 కోట్లు ఖర్చు చేయాలని దర్శకుడు భావించాడు.తేజ( Teja Sajja ) మార్కెట్ ను దృష్టి లో పెట్టుకుని సినిమా ను రూ.40 కోట్ల లోపు బడ్జెట్ తో రూపొందించాలని అనుకున్నాడు.

కానీ సినిమాకు వచ్చిన బజ్ నేపథ్యం లో ఏకంగా వంద కోట్లు ఖర్చు చేస్తున్నారనే టాక్ వినిపిస్తుంది.ఖర్చు పెట్టినా కూడా సినిమా కు ఈజీగా ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.150 కోట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.అందుకే నిర్మాతలు, దర్శకుడు ఏమాత్రం వెనకాడకుండా భారీ ఎత్తున ఖర్చు చేస్తున్నారు.ఆదిపురుష్ కంటే కూడా హనుమాన్ భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.







