Movie Shootings: ఇదే అప్పటి సినిమాకి ఇప్పటి సినిమాకు ఉన్న అతి పెద్ద తేడా !

వాస్తవానికి ఇప్పుడు ఏదైనా సినిమా( Movie ) చేయాలంటే నాలుగైదు ఏళ్ల టైం తీసుకుంటున్నారు ఈతరం దర్శకులు.

కానీ కొన్నేళ్లు వెనక్కి వెళితే పరిస్థితులు ఇలా ఉండేవి కాదు.

సినిమా పూర్తిగా రీల్ పద్ధతిలో తీసేవారు.రీల్( Reel ) ఎంత వృధా చేస్తే అంత నష్టం ప్రొడ్యూసర్ కి వస్తుంది.

అందువల్ల రీల్ వేస్ట్ అవ్వకూడదు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని రకాల వ్యయప్రయాసలు ముందే పడి షూటింగ్ ని( Shooting ) చేసేవారు.దాంతో నిర్మాతకు తక్కువ ఖర్చు అలాగే తక్కువ టైంలో షూటింగ్ కూడా పూర్తయ్యేది.

దానివల్ల ఒకే ఎడాది ఎక్కువ సినిమాలు చేసే అవకాశం దర్శకులకు, నిర్మాతలకు మరియు హీరోలకు దొరికేది.గతంలో ఏడాదికి వందల్లో సినిమాలు విడుదల అయ్యేవి.

Advertisement

ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు ఇకపై ఉండబోవు.

నిజానికి గతానికి ఇప్పటికీ టెక్నాలజీ( Technology ) చాలా అభివృద్ధి చెందింది ఎంత టెక్నాలజీ పెరిగితే అంత సినిమా లేటుగా షూటింగ్ పూర్తవుతుంది ఎందుకంటే టెక్నాలజీ వల్ల షార్ట్ క్లారిటీగా, HD క్వాలిటీతో వస్తుంది కానీ సీన్ క్లారిటీ ఉండడం లేదు.పైగా రీల్ ఎలాగూ వేస్ట్ అయ్యే పనిలేదు డిజిటల్ గా సినిమా తీయడం అందరికీ వచ్చేసింది దానివల్ల రూట్ ఎంత షార్ట్ తీసిన వృధా అయ్యేదేమీ లేదు ఆ భయం లేకపోవడం వల్లే ఎన్నిసార్లు అయినా మళ్ళీ మళ్ళీ షూట్ చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది ఎంత ఎక్కువ ఫుటేజ్ వచ్చిన నష్టం లేదు.పైగా టెక్నాలజీ పేరు చెప్పుకొని మరింత వృధా ఖర్చు చేస్తారు అవసరం లేకపోయినా వందల్లో డాన్సర్స్ ని( Dancers ) పెట్టి పాటలు తీస్తారు.

డజన్ల కొద్ది ఫైటర్స్ ని పెట్టి యాక్షన్ ఎపిసోడ్స్( Action Episodes ) తీస్తారు.దానివల్ల ఏదో కొత్తగా చూపిస్తున్నాం అనుకుంటున్నారు కానీ కొత్తగా ఒరిగేది అయితే ఏమీ లేదు.

నిర్మాణ వ్యయాన్ని పెంచుకుంటూ పోతున్నారు ఎక్కువ రోజులు షూటింగ్ చేయాల్సి వచ్చి ఎక్కువ హీరో డేట్స్ తీసుకుంటున్నారు.ఎక్కువ రోజులు పాటు ఒకే చిత్రం చేయడం వల్ల మరొక సినిమా చేయలేకపోతున్నారు సదర్ హీరోలు దాంతో రెమ్యూనరేషన్( Remuneration ) పెంచేసి ఒకే సినిమాకి అంకితం అవుతున్నారు దీనివల్ల పూర్తిస్థాయి కష్టం, నష్టం తప్ప ఎవరికి లాభం లేదు.అందుకే సినిమాల రిలీజ్ ల సంఖ్య తగ్గిపోతుంది ఎక్కువ సినిమాలు ముందులా విడుదలవ్వడం లేదు మరి ఇంకా టెక్నాలజీ పెరిగే అవకాశం ఉంది కానీ తగ్గిపోయే అవకాశం లేదు కాబట్టి ఒక్కో సినిమాకి దశాబ్దం పట్టిన ఆశ్చర్యపోనవసరం లేదు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు