తన టీమ్ తో కలిసి కరోనాపై అవగాహన కలిగిస్తున్న రాజమౌళి !

ప్రస్తుతం రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్.ఈ సినిమా పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తుంటే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు.

ఈ సినిమాను భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తున్నారు.ఈ సినిమాను డివివి దానయ్య 450 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.

ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన ఒక విదేశీ భామ నటిస్తుంటే రామ్ చరణ్ కు జోడీగా ఆలియా భట్ నటిస్తుంది.బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.

Advertisement

ఈ సినిమాను జక్కన్న అక్టోబర్ 13 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు.ఇప్పుడిప్పుడే దేశంలో కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు చక్కబడుతున్నాయి.

ఈ సినిమా షూటింగ్ ఇంకా కొద్దీ భాగం మాత్రమే బాలన్స్ ఉంది.రెండు పాటలు, కొద్దిగా ప్యాచ్ వర్క్ మాత్రమే ఉండడంతో జూన్ లో షూటింగ్ మొదలు పెట్టి వీలైనంత తొందరగా ఏ సినిమా షూటింగ్ పూర్తి చేయాలనీ రాజమౌళి అనుకుంటున్నాడట.

అయితే రాజమౌళి తన టీమ్ తో కలిసి ప్రజలకు కరోనా పై అవగాహన ఇస్తున్నాడు.ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ టీమ్ లో రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్, కీరవాణి కూడా కరోనా బారిన పడి కోలుకున్నారు.దీని నుండి కోలుకున్న తర్వాత తమకు చేతనైనంత వరకు ప్రజలకు అవగాహన కల్పించడం మొదలు పెట్టారు.

తాజాగా రాజమౌళి తన టీమ్ తో కలిసి ఇంస్టాగ్రామ్ ద్వారా ప్రముఖ డాక్టర్ శంకర్ ప్రసాద్ తో కలిసి ఒక ఇంటరాక్షన్ ప్రోగ్రాం ను నిర్వహించి అనేక సందేహాలకు జవాబులు అందించారు.కరోనా సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి వంటి అంశాలను చర్చించారు.అంతేకాదు వాక్సిన్ గురించి కూడా మాట్లాడారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

మీరు కూడా ఈ వీడియో చూడాలంటే రాజమౌళి ఇంస్టాగ్రామ్ లోకి వెళ్లి చూడవచ్చు.

Advertisement

తాజా వార్తలు