టీమిండియాకు ( Team India )కొత్త జెర్సీలు వచ్చాయి.టీమిండియా జెర్సీలను ఎప్పటికప్పుడు కొత్త కొత్త లుక్స్‌లో తీసుకొస్తూ ఉంటారు.
విభిన్న రకాల రంగుల్లో, వివిధ రకాల స్టైలిష్ లుక్స్‌లలో కొత్తగా ప్రవేశపెడుతూ ఉంటారు.తాజాగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్( WTC Final match ) సందర్బంగా టీమిండియాకు కొత్త జెర్సీలు( New Jerses ) వచ్చాయి.
ప్రముఖ బ్రాడెండ్ దుస్తుల తయారీ సంస్థ అడిడాస్( Adidas ) టీమిండియా జెర్సీలను తయారుచేస్తోంది.ఆ సంస్థ జెర్సీలకు స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది.
తాజాగా టీమిండియా జెర్సీలకు సంబంధించి అధికారికంగా డ్రెస్‌లను విడుదల చేసింది.
మూడు ఫార్మాట్లకు విడివిడిగా కొత్త లుక్‌లలో జెర్సీని విడుదల చేసింది.
ఆడిడాస్ సంస్థ జెర్సీ పొటోలను తమ ట్విట్టర్‌లో షేర్ చేసింది.వన్డే ఫార్మట్‌కు ఒక జెర్సీ, టెస్ట్ ఫార్మట్‌కు ఒక జెర్సీ, టీ20 ఫార్మట్ కోసం మరో జెర్సీ విడుదల చేసింది.
ఇప్పటివరకు టీమిండియా జెర్సీలను నైక్ సంస్థ ( Nike )తయారుచేస్తోంది.ఆ సంస్థ మొన్నటివరకు అఫీషియల్ పార్టనర్ గా ఉండేది.
అయితే తొలిసారి అడిడాస్ సంస్థ టీమిండియా జెర్సీలను తయారుచేసింది.
జెర్సీల ఆవిష్కరణకు సంబంధించి ప్రత్యేక యానిమేటెడ్ వీడియోను విడుదల చేసింది.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ ా మారింది.కాలర్ లేకుండా డార్క్ బ్లూ రంగులో ఉన్న జెర్సీని టీ2ల కోసం ఉపయోగించనుండగా.
బైల్ బ్లూ కలర్‌లో ఉన్న జెర్సీని వన్డేలకు ధరించనున్నారు.ఇక వైల్ కలర్ జెర్సీని యధావిధిగా టెస్టులకు ఉపయోగిస్తారు.
జూన్ 7న ఆస్ట్రేలియాతో వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ టీమిండియా ఆడనుంది.ఈ ఫైనల్ నేపథ్యంలో కొత్త జెర్సీలను ఆడిడాస్ విడుదల చేసింది.
ఈ కొత్త జెర్సీలతో టీమిండియా టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఆడనుంది.పురుషులతో పాటు మహిళా క్రికెటర్లు కూడా ఇవే జెర్సీలను ధరించనున్నారు.
జైజూస్ సంస్థ అర్థాంతరంగా బీసీసీఐతో ఉన్న కాంట్రాక్ట్‌ను రద్దు చేసుకుంది.దీంతో అడిడాస్ సంస్థ ప్రస్తుతం జెర్సీ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది.