ఐసీసీ తాజాగా టెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల చేసింది.భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ను భారత్ 4-1 తేడాతో కైవసం చేసుకుని, టెస్ట్ క్రికెట్లో భారత జట్టు నంబర్ వన్ జట్టుగా అవతరించింది.
అంతేకాదు వన్డే, టీ20ల్లో కూడా ఐసీసీ ర్యాంకింగ్స్ లో టీం ఇండియా అగ్రస్థానంలోనే ఉంది.ప్రస్తుతం టీమిండియా( Team India) మూడు ఫార్మాట్లలో ప్రపంచంలోనే నంబర్ వన్ జట్టుగా అవతరించింది.
భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కి ముందు ఆస్ట్రేలియా జట్టు ఐసీసీ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో ఉండేది.కానీ తాజాగా భారత్ టెస్ట్ సిరీస్ కైవసం చేసుకున్నాక, భారత్ 4636 పాయింట్లతో,122 రేటింగ్ తో ఐసీసీ ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో నిలిచింది.
![Telugu Icc, Kane Williamson, India, Virat Kohil-Sports News క్రీడల Telugu Icc, Kane Williamson, India, Virat Kohil-Sports News క్రీడల](https://telugustop.com/wp-content/uploads/2024/03/ICC-Test-Rankings-Team-India-Yashasvi-Jaiswal-Kane-Williamson.jpg)
ఈ జాబితాలో ఆస్ట్రేలియా 117 రేటింగ్ తో రెండవ స్థానంలో, ఇంగ్లాండ్ 111 రేటింగ్ తో మూడవ స్థానంలో, న్యూజిలాండ్ 101 రేటింగ్ తో నాలుగువ స్థానంలో ఉన్నాయి.ఆస్ట్రేలియా వర్సెస్ న్యూజిలాండ్ రెండవ టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించిన, ఆస్ట్రేలియా ఐసీసీ ర్యాంకింగ్స్ లో రెండవ స్థానంలోనే ఉంటుంది.
![Telugu Icc, Kane Williamson, India, Virat Kohil-Sports News క్రీడల Telugu Icc, Kane Williamson, India, Virat Kohil-Sports News క్రీడల](https://telugustop.com/wp-content/uploads/2024/03/ICC-Test-Rankings-Team-India-Yashasvi-Jaiswal-Ravichandran-Ashwin-sports-sports-news.jpg)
ప్రస్తుతం భారత జట్టు 122 రేటింగ్ తో టెస్ట్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో, 121 రేటింగ్ తో వన్డే ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో, 266 రేటింగ్ తో టీ20 లో అగ్రస్థానంలో నిలిచింది.ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో బ్యాట్స్ మెన్ల విషయానికి వస్తే.న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ 870 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.ఇంగ్లాండ్ ప్లేయర్ జో రూట్ 799 రేటింగ్ తో రెండవ స్థానంలో, ఆస్ట్రేలియన్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ 789 రేటింగ్ తో మూడవ స్థానంలో ఉన్నారు.
భారత స్టార్ బ్యాటర్లైన విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్ ఐసీసీ ర్యాంకింగ్స్ లో టాప్-10 లో ఉన్నారు.ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో బౌలర్ల విషయానికి వస్తే.
భారత జట్టు స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా 867 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.భారత జట్టు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్( Ravichandran Ashwin ) 846 రేటింగ్ పాయింట్లతో రెండవ స్థానంలో ఉన్నాడు.