భారత సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ తన కామెంట్రీతో అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాడు.ఇటీవల భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి కామెంటేటర్‌గా వ్యవహరించిన దినేశ్ కార్తీక్.
ఆ తర్వాత ఇంగ్లాండ్, శ్రీలంక మధ్య జరిగిన వన్డే, టీ20 సిరీస్‌కి కూడా కామెంటేటర్‌గా పనిచేశాడు.ఇక భారత్, ఇంగ్లాండ్ మధ్య అక్కడే ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 14 వరకూ జరగనున్న ఐదు టెస్టుల సిరీస్‌కి కూడా కామెంటేటర్‌గా దినేశ్ కార్తీక్ ఎంపికయ్యాడు.
వాస్తవానికి భారత్ క్రికెటర్లు ఇంటర్నేషనల్ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాతే కామెంటేటర్‌గా పనిచేస్తుంటారు.కానీ తాను ఆ మూస ధోరణిని మార్చాలని ఆశిస్తున్నట్లు దినేశ్ కార్తీక్ చెప్పుకొచ్చాడు.2019 వన్డే ప్రపంచకప్ తర్వాత టీమిండియాకి దూరమైన దినేశ్ కార్తీక్ ఐపీఎల్, దేశవాళీ టోర్నీల్లో మాత్రం రెగ్యులర్‌గా ఆడుతున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ తనకి ఇంకో ఛాన్స్ ఇస్తే ఆడాలని ఉందంటూ భారత సెలెక్టర్లని కోరాడు.2019 వన్డే ప్రపంచకప్‌లో చివరిసారిగా భారత్ తరపున మ్యాచ్‌లు ఆడి దినేశ్ కార్తీక్ అద్బుత ప్రదర్శన ఇచ్చాడు.అప్పటి నుంచి తాను టీమిండియాకి దూరంగా ఉండిపోవడం విశేషం.

యువ వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ మూడు ఫార్మాట్లలోనూ రెగ్యులర్ ఆటగాడిగా మారిపోవడంతో ఆ తర్వాత దినేశ్ కార్తీక్‌కి ఛాన్స్ రాలేదు.తాను కనీసం ఒక్క టీ20 వరల్డ్‌కప్‌లోనైనా భారత్ తరపున మళ్లీ ఆడాలని ఉందంటూ తన కోరికను దినేవ్ కార్తీక్ చెప్పుకొచ్చాడు.ప్రస్తుతం దినేశ్ కార్తీక్ కామెంటేటర్ గా వ్యవహరిస్తూ ఉండటంతో బీసీసీఐకి తన అభ్యర్థనను వెలిబుచ్చాడు.దీనిపై బీసీసీఐ త్వరలోనే ఓ నిర్ణయానికి రానున్నట్లుగా తెలుస్తోంది.దినేశ్ కార్తీక్ ఇలా వ్యవహరించడం పట్ల పలువురు ఆశ్చర్యానికి గురవుతున్నారు.ఆయనకు క్రికెట్ ఆడే ఛాన్స్ రావాలని ఆశిస్తున్నారు.