ఏపీలో అప్పుడే ఎన్నికలన్నట్లు రాజకీయాలు మొదలుపెట్టారు.పాదయాత్రలు.ఇంటింటికి ప్రభుత్వ పథకాలు పేరుతో ఇప్పటికే ప్రజల్లోకి వెళ్తున్నారు.ఇక ప్రధాన పార్టీలు అన్నీ కూడా జోరు పెంచాయి.అధికార పార్టి వైసీపీ ఇప్పటికే ప్లీనరీల పేరుతో ప్రజల్లోకి వెళ్లింది.ఇకట టీడీపీ కూడా మహానాడు వేడుక నిర్వహించి భారీ జనసమీకరణతో జోష్ నింపింది.
ఇక బాబు జిల్లాల్లో పర్యటిస్తూ.ఇటీవల వరదలు వచ్చిన్నప్పుడు బాధితులను పరామర్శిస్తూ ప్రజల్లో ఉన్నారు.
ఇక టీడీపీకి పార్టీ క్యాడర్ కూడా బలంగా ఉంది.క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు పుష్కలంగా ఉన్నారు.
అయితే టీడీపీ సీనియర్లతో నిండిపోయిందని.ఓల్డ్ నేతలతో భారీన్ని మోస్తుందనే వాదన వినిపిస్తోంది.
ఈ నేపథ్యంలోనే బాబు ఈ సారి నలబై శాతం యువకులకు అవకాశాలు కల్పిస్తామని చెప్పారు.సాహసోపేతమైన నిర్ణయాలకు కూడా ఆ పార్టీ వెనుకాడేది లేదని సంకేతాలిస్తోంది.
1982లో పార్టీ ప్రారంభించిన తొలినాళ్లలో ఎన్టీఆర్ చెప్పిన మాటనే ఇప్పుడు చంద్రబాబు ఆచరణలో పెడుతున్నట్లు కనిపిస్తోంది.కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు ఎక్కువయ్యారని… దీని వల్ల అభివృద్ధి కూడా ఆగిపోయిందని నాడు ఎన్టీఆర్ వ్యాఖ్యానించారు.
రాష్ట్రానికి యువ నాయకత్వం కావాలని పిలుపునిచ్చారు.దీంతో నాడు ఎన్టీఆర్ స్ఫూర్తితో ఎంతో మంది యువత రాజకీయాల్లోకి వచ్చారు.
అయితే నాడు రాజకీయాల్లోకి వచ్చిన వారిలో చాలా మంది తమ వారసులను తీసుకువచ్చారు.కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం ఇప్పటికీ సీనియర్ల హవానే కొనసాగుతోంది.
దీంతో యంగ్ లీడర్లు కొందరు ఇప్పటికే పార్టీ మారారు.
ప్రస్తుతం టీడీపీలో జూనియర్ల కంటే కూడా.
సీనియర్లే శాతమే ఎక్కువగా ఉంది.పరిస్థితి ఇలాగే కొనసాగితే… టీడీపీ కూడా రాబోయే రోజుల్లో మరో కాంగ్రెస్ పార్టీ అవుతుందనే అభిప్రాయం ఇప్పటికే వెల్లడవుతోంది.
దీంతో పార్టీకి యువరక్తం ఎక్కించేందుకు అధినేత చంద్రబాబు సిద్ధమవుతున్నారు.ఇప్పటికే పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున చంద్రబాబు రాబోయే ఎన్నికల్లో 40 శాతం సీట్లు యువతకే అని ప్రకటించారు.
అయితే ఈ ప్రకటన కూడా కాస్త అయోమయానికి గురి చేస్తుంది.ప్రస్తుతం ఉన్న నేతల వారసులకే అవకాశం ఇస్తారేమో అనే అనుమానాలు ప్రస్తుతం యువనేతల్లో ఉన్నాయి.అయితే వీటన్నిటికీ బ్రేక వేసేలా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తాజాగా వ్యాఖ్యలు చేశారు.
యంగ్ బ్లడ్ రావాలంటూ లోకేశ్ పిలుపు

పార్టీ పోలిట్ బ్యూరో సమావేశంలో అన్ని అంశాలతో పాటు పార్టీలో యువత భాగస్వామ్యంపై కూడా చర్చించారు టీడీపీలోకి యంగ్ బ్లడ్ రావాలంటూ లోకేశ్ పిలుపు నిచ్చారు.పార్టీలో యువతకు ప్రాతినిథ్యంపై ప్రత్యేకంగా ప్రస్తావించారు.కీలక సూచనలు కూడా చేశారు.
దీంతో సమగ్ర అధ్యయనం కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని పొలిట్ బ్యూరో నిర్ణయం తీసుకుంది.యువతకు ప్రాధాన్యం, యువత భాగస్వామ్యం పెరిగేలా పార్టీ తీసుకోవాల్సిన చర్యలపైన ప్రత్యేక కమిటీ నివేదిక ఇవ్వనుంది.
వచ్చే పొలిట్ బ్యూరో సమావేశం నాటికి పక్కా కార్యాచరణతో ముందుకు వెళ్లాలని లోకేష్ సూచించారు.పార్టీలో నూతనత్వం, యువ రక్తం ఎక్కించేందుకు వేగంగా కసరత్తు చేపట్టాలని… యువతకు కీలక భాగస్వామ్యం ఇవ్వాలని కూడా లోకేశ్ సూచించారు.
దీంతో రాబోయే ఎన్నికల నాటికి పార్టీలో యంగ్ బ్లడ్ ప్రవహించేలా చంద్రబాబు వ్యూహ రచన చేస్తున్నారు.