టీడీపీ లో వారికే ఛాన్స్ .. వీరికి నో ఛాన్స్ ? లోకేష్ కోసమేగా ? 

తెలుగుదేశం పార్టీని సమూలంగా ప్రక్షాళన చేసి ఒక గాడిలో పెట్టాలనే దృఢనిశ్చయంతో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు.2024 ఎన్నికల్లో పార్టీకి అధికారం దక్కాలనే దృఢనిశ్చయంతో ఆయన పనిచేస్తున్నారు.నిత్యం ఏదో ఒక అంశంపై ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే పార్టీ నాయకుల్లో జోష్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు.తాజాగా టీడీపీ మహానాడు లోనూ ఎన్నో తీర్మానాలు చేశారు.

 Tdp Youth Leaders Dissatisfied With Not Giving Due Priority To Lokesh, Tdp, Chan-TeluguStop.com

ఈ సందర్భంగా పార్టీకి  పునర్వైభవం ఏ విధంగా తీసుకురావాలనే విషయంపైనా లోతుగానే చర్చించారు.ఇదంతా ఇలా ఉంటే టీడీపీలోని కొంతమంది నాయకులు చంద్రబాబు తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారట.

 అసలు పార్టీ పుంజుకోలేకపోవడానికి కారణం ఏంటా విషయం పైనా పార్టీలో జోరుగానే చర్చ జరుగుతోంది.దీనికి కారణం చంద్రబాబు టిడిపి లోని కొంతమంది నాయకులకు మాట్లాడే అవకాశం కల్పిస్తున్నారు అని, పార్టీకి మైలేజ్ పెంచే విధంగా, వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా ఎంతో మంది మాట్లాడే సత్తా ఉన్న నాయకులు ఉన్నా,  చంద్రబాబు మాత్రం కొంతమందికి మాత్రమే పార్టీ లో మాట్లాడే అవకాశం ఇస్తున్నారు అని, ఆ నేతలు కూడా ప్రజాబలం లేని వారు, ఎన్నికల్లో ఓటమి చెందిన వారే ఎక్కువమంది ఉన్నారు అని , వారి విమర్శలను ప్రభుత్వం కానీ, ప్రజలు కానీ ఎవరు పట్టించుకోవడం లేదు అనేది కొంతమంది వాదన.

Telugu Chandrababu, Chinababu, Jagan, Lokesh, Tdp, Tdp Mahanadu, Ysrcp-Telugu Po

 ప్రస్తుతం ఏపీలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది.ఈ వైరస్ కారణంగా ఎంతోమంది ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు.ఆక్సిజన్ కొరత, ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు లేకపోవడం వంటి ఎన్నో లోటుపాట్లు ఉన్నాయి.వైసిపి ప్రభుత్వం పెద్దఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నా, ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది.

దీనిని సద్వినియోగం చేసుకుని పార్టీకి మైలేజ్ ఇచ్చే విధంగా వ్యవహారాలు చేయాల్సి ఉన్నా, చంద్రబాబు పార్టీలు ప్రజా బలం మంచి వాక్చాతుర్యం ఉన్న నేతలకు అవకాశం కల్పించడం లేదని కేవలం కొంతమంది సీనియర్లు,  రాజకీయ రిటైర్మెంట్ కు దగ్గరగా ఉన్న నేతలకు ,రాబోయే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండేవారికి ప్రాధాన్యం ఇస్తున్నారని, యువ నాయకులకు పార్టీలో పెద్దగా గుర్తింపు ఇవ్వడంలేదని చంద్రబాబు తీరుపై అసంతృప్తితో ఉన్నారట అయితే యువ నాయకులకు ప్రాధాన్యం ఇవ్వకపోవడానికి కారణం లోకేష్ రాజకీయ భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకోవడమే కారణంగా కనిపిస్తోంది.పార్టీలోని యువ నాయకులకు,  వాక్చాతుర్యం ఉన్న నేతలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తే వారంతా లోకేష్ ను డామినేట్ చేస్తారని, రానున్న రోజుల్లో లోకేష్ కు ఇబ్బందులు ఏర్పడతాయనే ఉద్దేశంతో చంద్రబాబు ఈ విధంగా కొంతమంది నేతలకే ప్రాధాన్యం కల్పించడం వల్ల పార్టీ పుంజుకోలేకపోతోంది అనేది యువ నాయకుల బాధగా కనిపిస్తోంది.

మీడియా ముందుకు వచ్చే వారంతా పార్టీలో అవుట్ డేటెడ్  నాయకులే అన్నది టీడీపీ లోని యువ నాయకుల వాదన.అయినా ఈ పట్టింపులను బాబు పట్టించుకునే పరిస్థితిలో లేేరట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube