విజయవాడ టిడిపి ఎంపీ కేసినేని నాని( kesineni nani ) వ్యవహారం తెలుగుదేశం పార్టీలో( TDP Party ) చాలా రోజులుగా తీవ్ర చర్చనీయాంశం అవుతుంది.సొంత పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండడం , వైసిపి ఎమ్మెల్యేలు, ఎంపీలతో( YCP MLA, Mp ) కలిసి అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ, వారిని ప్రశంసిస్తూ ఉండడం వంటివి టిడిపికి ఇబ్బందికరంగా మారింది.
అంతేకాకుండా టిడిపిలో ఓ వర్గం నాయకులు తరచుగా నానిని టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేస్తున్నారు.దీనిపై నాని కూడా అంతే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు.
ఇదిలా ఉంటే కేశినేని నానికి వైసీపీ కూడా ఆహ్వానాలు పంపుతోంది.

వైసీపీలో చేరితే తగిన ప్రాధాన్యం ఇస్తామనే హామీలు కూడా ఇస్తున్నారు.అయితే పార్టీ మారే విషయంలో నాని కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నారు.2024 ఎన్నికల్లో టిడిపి ఎంపీ అభ్యర్థిగా తన సోదరుడు కేశినేని చిన్నిని తెరపైకి తీసుకొస్తూ ఉండడం, ఇప్పటికే విస్తృతంగా చిన్ని విజయవాడ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో పర్యటనలు చేస్తున్నారు.టిడిపి అధిష్టానం ఆయనకు అంతే స్థాయిలో ప్రాధాన్యం ఇస్తుండడం వంటివన్నీ, నానికి ఇబ్బందికరంగా మారాయి.అయితే తరచుగా పార్టీ క్రమశిక్షణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న నానిపై సస్పెన్షన్ వేటు వేయాలని టిడిపి నిర్ణయించుకుంది.

సరైన సమయంలో ఆయనపై చర్యలు తీసుకోవాలని వేచి చూస్తోంది.ఇటీవల వైసిపి ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు( mondithoka jaganmohan rao ), కేశినని నాని పై ప్రశంసలు కురిపించారు.దీనిపై వెంటనే విజయవాడ టిడిపి కీలక నేత, ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధ వెంకన్న( Buddha Venkanna ) స్పందించి విమర్శలు చేశారు.తాను నాని గురించి ఎటువంటి విమర్శలు చేయనంటూ చెబుతూనే, చంద్రబాబు గురించి నాని మాట్లాడితే ఊరుకునేది లేదంటూ వెంకన్న ఫైర్ అయ్యారు.
ఇక ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో నాని మరింత స్పీడ్ పెంచి, టిడిపి పై విమర్శలు చేయకముందే సరైన సమయంలో ఆయనపై చర్యలు తీసుకోవాలనే ఆలోచనతో చంద్రబాబు ఉన్నట్లు సమాచారం.