జగన్ పోలవరం ప్రాజెక్టును గోదావరిలో ముంచేశారు - మాజీ మంత్రి దేవినేని ఉమ

ఏలూరు: పట్టిసీమ ప్రాజెక్టును సందర్శించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమ. పట్టిసీమ ప్రాజెక్టు వద్ద గోదారి తల్లికి పూజలు నిర్వహించిన దేవినేని ఉమ.

 Tdp State Secretary Devineni Uma Visits Pattiseema Project, Tdp State Secretary,-TeluguStop.com

ఉమా కామెంట్స్.పట్టిసీమ ఒక నాయకుడు విజన్, ఆలోచన, ఆచరణ.

చంద్రబాబు నాయుడు జాతి సంపద సంపద సృష్టించేవాడు.జగన్ పోలవరం ప్రాజెక్టును గోదావరిలో ముంచేశారు.

పట్టిసీమ ద్వారా కృష్ణమ్మను గోదావరి తల్లిని పవిత్ర సంగమంలో లో కలిపిన మహా నాయకుడిని రాజమండ్రి జైల్లో నిర్బంధం చేశాడు.విశాఖలో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజీ మీద సదస్సు జరుగుతుంది ప్రభుత్వం ఐదు కోట్లు ఖర్చు పెడుతుంది దీని గురించి ఐదు నిమిషాలు కూడా మాట్లాడలేదు.90 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు విద్యార్థులు ఇంజనీర్లు ఉన్నారు కేంద్ర జల వనరుల శాఖ మంత్రి షేకావత్ కూడా ఉన్నారు ఒక్క మాట కూడా నదుల అనుసంధానం గురించి మాట్లాడలేదు.

అలాంటి వాడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నువ్వు అర్హుడా అని అడుగుతున్నా.151 మంది ఎమ్మెల్యేలు ఒక్కడైనా వచ్చి ఈ పట్టిసీమ నేలను చూశారా ? 13 లక్షల ఎకరాల కృష్ణా డెల్టా లో మూడు లక్షలు పంట వేయలేదు వేసిన పంటను ఈ 46 టీఎంసీలు కాపాడాయి.పట్టిసీమ కట్టినోడు 52 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడు.

పట్టిసీమ దండగ పంపులు పీకుతా అన్న దరిద్రుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు.ఇటువంటి చేతకాని ముఖ్యమంత్రి అసమర్థులైన మంత్రులు ఎమ్మెల్యేలు ఈ రాష్ట్రానికి అవసరం లేదు.పక్క రాష్ట్రంలో కాలేశ్వరం ప్రారంభోత్సవానికి డ్రామాలాడి వెళ్లి కొబ్బరికాయలు కొట్టి వచ్చారు.1600 కోట్లు ఖర్చుపెట్టిన పట్టిసీమ 50 వేలకోట్ల సంపాదన సృష్టించింది.

ఇక్కడ 24 పంపులు ఉంటే నీళ్ల అవసరం ఎక్కువగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో 18 పంపులు ఆడిస్తున్నారంటే ఇంత చేతగాని పనికిమాలిన ముఖ్యమంత్రి ఇరిగేషన్ మంత్రి ఎవరైనా ఉంటారా ?బుల్లెట్ దింపుతాను అన్నవాడు అడ్రస్ లేకుండా పోయాడు ఇప్పుడున్న ఇరిగేషన్ మంత్రి పోలవరం నన్ను అడగవద్దు అంటూ చేతులెత్తేశాడు ఎప్పుడు అవుతుందో చెప్పలేను అన్నాడు.నిర్వాసితులను గాలికి వదిలేసాడు.

జగన్మోహన్ రెడ్డి మీరు అన్నం తినే వాళ్ళు అయితే పట్టిసీమ ప్రాజెక్టు గోదావరి నీళ్ల వద్దకు వచ్చి ముక్కు నేలకు రాసి చంపలేసుకోవాలి.

పాపాల పెద్దిరెడ్డి అనుచరులు ముఖ్యమంత్రి అనుచరులు చంద్రబాబు మీద మాపైన 307, ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారు.

చంద్రబాబు నాయుడు నిన్న ఆసుపత్రి వద్దకు వెళితే అక్కడ ఇద్దరు డిఎస్పీ లను పెడతామని ప్రభుత్వం కోర్టుకెళ్తే మొట్టికాయలు వేసింది.జగన్మోహన్ రెడ్డి ఎందుకు నీ డిఎస్పీలు అక్కడ చంద్రబాబునాయుడు ఏ మందులు ఏమి ఇంజక్షన్లు వాడుతున్నారో కావాలా.బాబాయ్ హత్య కేసులో తమ్ముడు ఎంపీ అవినాష్ రెడ్డి ని కాపాడుకోవడానికి రాష్ట్ర ప్రయోజనాలను జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెట్టాడు.440 మండలాల్లో కరువు విలయతాండవం చేస్తుంటే ఈ దుర్మార్గంగా 110 మండలాలే చెప్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube