వచ్చే ఎన్నికల్లో వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా టీడీపీ, జనసేన( TDP ) పార్టీలు ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ఈ రెండు పార్టీలు ఏకం అయ్యేందుకు కూడా రంగం సిద్దం చేసుకున్నాయి.
వచ్చే ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు చిలనివ్వనని ఘంటాపథంగా చెబుతున్నా పవన్.అందుకోసం ఏ చేయడానికైనా తాను సిద్దమే అని ఇప్పటికే చాలాసార్లు చెప్పుకొచ్చారు.
అటు చంద్రబాబు కూడా వైసీపీ అరాచక పాలనకు అడ్డుకట్ట వేయాలంటే కలిసికట్టుగా పోరాడాలని.పొత్తులకు సంబంధించి సిగ్నల్ ఇస్తున్నారు.
దీంతో టీడీపీ, జనసేన పార్టీల మద్య పొత్తు కన్ఫర్మ్ అని పోలిటికల్ సర్కిల్స్ లో చర్చ నడిచింది.

అయితే ఒకవేళ ఈ రెండు పార్టీలు కలిస్తే.సీట్ల పంపకాలు ఏ విధంగా ఉంటాయి.? సిఎం అభ్యర్థి ఎవరు అనే అంశాలు ప్రశ్నార్థకంగా వినిపిస్తుంటాయి.ఈ రెండు అంశాలపైనే స్పష్టత లేకపోవడం వల్లే టీడీపీ, జనసేన పొత్తును అధినేతలు అధికారికంగా కన్ఫర్మ్ చేయడం లేదని విశ్లేషకులు చెబుతున్నా మాట.కాగా ప్రస్తుతం ఏపీలో జనసేనతో పోల్చితే టీడీపీ బలమైన పార్టీ అనే సంగతి అందరికీ తెలిసిందే.కాబట్టి అధికారం చేపట్టే అవకాశాలు కూడా టీడీపీకే ఎక్కువగా ఉంటాయి.అయితే జనసేన టీడీపీతో కలిస్తే ఆ పార్టీకి మరింత మెంట్ ఫిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.

కానీ టీడీపీతో జనసేన ( Jana sena )కలవాలంటే.కొన్ని స్థానాలు కచ్చితంగా జనసేనకు కేటాయించాలనే పట్టుదలతో పవన్ ఉన్నారట.ముఖ్యంగా టీడీపీ కంచుకోతలుగా ఉన్న శ్రీకాకులం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాల్లో మెజారిటీ స్థానాలను జనసేనకే కేటాయించాలని పవన్ పట్టుబట్టినట్లు పోలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.ఈ జిల్లాలను జనసేనకు కేటాయిస్తే టీడీపీ పట్టు కోల్పోతుందనే భయం చంద్రబాబులో ఉందట.
అందుకే పొత్తు విషయంలో టీడీపీ, జనసేన మద్య విభేదాలు తప్పెలా కనిపించడం లేదు.మరి సీట్ల పంపకాల విషయంలో ఎవరు వెనక్కి తగ్గుతారు.? ఎవరి ఆధిపత్యం కొనసాగుతుంది అనేది ముందు రోజుల్లో తేలనుంది.







