సాధారణంగా సినిమా ఇండస్ట్రీ సక్సెస్ రేట్ ఒకింత తక్కువగానే ఉంటుందనే సంగతి తెలిసిందే.2023 సంవత్సరంలో ఫస్టాఫ్ లో ఈ సక్సెస్ రేట్ మరింత తక్కువగా ఉంది.నెలకు 1, 2 సినిమాలు సక్సెస్ సాధించడం కూడా గగనమవుతోంది.చిన్న హీరోల సినిమాలతో పాటు పెద్ద హీరోల సినిమాలకు సైతం ఇవే ఫలితాలు వస్తున్నాయి.హిట్ టాక్ వచ్చిన సినిమాలు భారీ రేంజ్ లో కలెక్షన్లను సాధిస్తుండగా యావరేజ్ టాక్ వచ్చిన సినిమాలు ప్రేక్షకులను మెప్పించడం లేదు.
ఈ ఏడాది జనవరిలో విడుదలైన సినిమాలలో వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, వారసుడు( Veera Simha Reddy ) సక్సెస్ సాధించాయి.
కల్యాణం కమనీయం, హంట్ సినిమాలు మాత్రం ప్రేక్షకులను నిరాశకు గురి చేశాయి.ఫిబ్రవరిలో విడుదలైన సినిమాలలో రైటర్ పద్మభూషణ్, సార్, వినరో భాగ్యము విష్ణు కథ సినిమాలు సక్సెస్ సాధించగా మైఖేల్, బుట్టబొమ్మ, అమిగోస్, శ్రీదేవి శోభన్ బాబు సినిమాలు మాత్రం ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్నాయి.</b

మార్చి నెలలో విడుదలైన సినిమాలలో బలగం, దాస్ కా ధమ్కీ( Balagam ) , రంగ మార్తాండ, దసరా ఆకట్టుకున్నాయి.ఆర్గానిక్ మామ్ హైబ్రీడ్ అల్లుడు, సి.ఎస్.ఐ సదన్, ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేదు.ఏప్రిల్ నెలలో విడుదలైన సినిమాల్లో విరూపాక్ష సినిమా సక్సెస్ సాధించింది.
మీటర్, రావణాసుర, శాకుంతలం, ఏజెంట్ సినిమాలు ఆశించిన ఫలితాలను అందుకోలేదు.</b

మే నెలలో విడుదలైన సినిమాలలో మేము ఫేమస్( Mem Famous ) మినహా ఏ సినిమా ఆకట్టుకోలేదు.భువన విజయమ్, కథ వెనుక కథ, అన్నీ మంచి శకునములే, మళ్లీ పెళ్లి, రామబాణం, ఉగ్రం సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి.జూన్ నెలలో విడుదలైన సినిమాల్లో సామజవరగమన సక్సెస్ సాధించింది.అహింస, నేను స్టూడెంట్ సార్, పరేషాన్, ఇంటింట్ రామాయణం, విమానం, టక్కర్ ఆకట్టుకోలేదు.ఆదిపురుష్, స్పై సినిమాలు సక్సెస్ సాధించినా ఈ సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించలేదు.







