బస్సుపై కక్ష: వదిలేయాలంటూ టీడీపీ ఆగ్రహంతో కూడిన వినతి

కొద్ది రోజుల క్రితం ఏపీ రాజధాని అమరావతి పర్యటనకు బయలుదేరిన టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన పార్టీకి చెందిన నాయకులపై కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడం, వారు ప్రయాణిస్తున్న బస్సుపై చెప్పులు విసరడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి.

ఆ తరువాత ఈ విషయంపై టీడీపీ వైసీపీ మధ్య పెద్ద యుద్ధ వాతావరణమే నడిచింది.

ఈ ఘటనపై పోలీసుల ఫిర్యాదు వరకు వ్యవహారం వెళ్ళింది.దీంతో పోలీసులు చంద్రబాబు పర్యటించిన బస్సును సీజ్ చేశారు.

అలా సీజ్ చేసి చాలా రోజులు అయినా ఆ బస్సును ఎందుకు విడుదల చేయడంలేదు అంటూ టీడీపీ నేతలు ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు.అయితే రాళ్ళు విసిరిన వారిని వదిలిపెట్టి పోలీసులు గత తొమ్మిది రోజులుగా బస్సును తమ ఆధీనంలోనే ఉంచుకుని యాజమాన్యాన్ని ఇబ్బంది పెడుతున్నారని ఏపీ టిడిపి అధ్యక్షుడు, మాజీ మంత్రి కళా వెంకట్రావు ప్రభుత్వానికి, రాష్ట్ర హోం శాఖ కార్యదర్శికి లేఖ రాశారు.

తక్షణమే బస్సును విడుదల చేయాలనీ, పోలీసులు చట్టం ప్రకారం మాత్రమే పనిచేయాలంటూ ఆయన తన లేఖలో డిమాండ్ చేసారు.జగన్ ప్రభుత్వం టీడీపీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతి పరులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని కళా విమర్శలు చేశారు.

Advertisement

తక్షణమే బస్సును విడుదల చేయాలని ఆయన పోలీసులను కోరారు.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం.. బాబుకు భలే షాకిచ్చారుగా!

Advertisement

తాజా వార్తలు