టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీలో యాత్రలకు పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు.మరో రెండేళ్లు ఎన్నికలకు సమయం ఉన్నా.
ముందస్తు కూడా వచ్చే అవకాశం ఉండటంతో ప్రజల్లోనే ఉండాలని భావిస్తున్నారు.ఇప్పటికే జిల్లాల్లో పర్యటిస్తున్న బాబు ఈ రెండేళ్లు జనంతోనే సావాసం చేయాలని నిర్ణయించుకున్నారు.
ఇక బాబుకు తోడుగా మరో ఇద్దరిని రంగంలోకి దింపి యాత్రలకు ప్లాన్ చేస్తున్నారు.వచ్చే ఎన్నికల వరకూ గ్యాప్ లేకుండా ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడానికి సిద్దమవతున్నారు.
అపర చాణక్యుడు చంద్రబాబు ఇప్పటికే జన్నాల్లో ఉన్నాడు.ఇక ఇదే రూట్ లో చినబాబు లోకేష్ కూడా ప్లాన్ చేస్తున్నాడు.
అనుకున్న ప్లాన్ చేంజ్.
అయితే లోకేష్ బాబు వచ్చే అక్టోబర్ నుంచి పాదయాత్ర మొదలు పెట్టాలని చూసినా ఇప్పుడు జనసేన అదే ప్లాన్ తో ఉండటంతో మరో ప్లాన్ తో ముందే అడుగులు వేయటానికి సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది.ఆగస్టులోనే ఈ యాత్ర ఉండొచ్చని అంటున్నారు.దీంట్లో మార్పులు కూడా ఉండే అవకాశం లేకపోలేదు.అయితే ప్రజల్లోకి వెళ్లడానికి చినబాబు భారీ టార్గెట్ తో పాదయాత్ర చేయబోతున్నట్లు తెలుస్తోంది.జగన్ పాదయాత్రను బీట్ చేసేలా నాలుగు వేల కిలోమీటర్లు అయినా సుదీర్ఘ పాదయాత్రగా చేయాలనే యోచనలో ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అయితే ఈ పాదయాత్ర జగన్ ఇలాకా రాయలసీమ జిల్లాల నుంచే మొదలుపెట్టాలని షెడ్యూల్ రెడీ చేపిస్తున్నారట.పాదయాత్రతో జనంలోకి వెళ్లి ఫోకస్ కావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక బాబు యాత్రలు జిల్లాల్లో ఎలాగూ ఉంటాయన్నది తెలిసిన విషయమే.ఏడాది పాటు ఇక జిల్లాల్లోనే గడపనున్నారు.ఆ తర్వాత మిగిలిన ప్రాంతాలను బస్సు యాత్రతో ఫినిష్ చేయనున్నట్లు తెలుస్తోంది.ఇక మరోవైపు ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని కూడా బాబు రంగంలోకి దింపనున్నట్లు తెలుస్తోంది.
ఉత్తరాంధ్రాలో బలమైన బీసీ నేతగా ఉన్న అచ్చెన్నాయుడిని ఏపీలో బీసీ యాత్ర చేయిస్తారు అని అంటున్నారు.బీసీ వర్గాల మద్దతు కోసం కూడా పక్కా ప్లాన్ తో వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక పార్టీ సీనియర్ నాయకులు, జిల్లాల అధ్యక్షులు ప్రజల్లోనే ఉంటూ నిత్యం వాళ్లకు అందుబాటులో ఉండాలని ఇప్పటికే ఆదేశించారు.
రెగ్యూలర్ గా నియోజకవర్గాల్లో పర్యటించాలని ఆదేశించారు.
అలాగే కష్టపడి పని చేసిన వారికే పదవులు ఉంటాయని కూడా మహానాడు వేదికగా బాబు దిశా నిర్దేశం చేశాడు.మొత్తానికి టీడీపీ హైకమాండ్, నేతలు, ప్రజల్లోనే ఉండటానికి పక్కా ప్లాన్ తో బయలుదేరుతున్నారు.
ఎట్టిపరిస్థితుల్లో వైసీపీకి అధికారం చేజిక్కకుండా వ్యూహాన్ని రచిస్తున్నారు.







