టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి.నారా లోకేష్ పాదయాత్ర ఈ నెల 27న ప్రారంభం కానుంది.
సుమారు 450 కిలోమేటర్ల మేర ఆయన పాదయాత్ర చేయడానికి టీడీపీ నేతలు ప్లాన్ చేశారు.యువగళం పేరుతో ఆయన చేపట్టబోయే యాత్రకు భారీ స్థాయిలో మద్దతు వస్తుందని ఆ పార్టీ నేతలు గట్టి నమ్మకం పెట్టుకున్నారు.
ఆయన గనుక యూత్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకోగలిగితే.పవన్ అవసరం లేకుండానే టీడీపీ అధికారం చేపడుతుందని అంచనా వేస్తున్నారు.నిజానికి నారా లోకేష్ వల్లే.ఆ పార్టీకి అపారమైన నష్టం వాటిల్లింది.
ఇక ఇప్పుడు ఆయన యాత్రతో కొంత జోష్ వస్తుంది అనుకునే టైంలో.ప్రభుత్వం జీవో నెంబర్ వన్ ను తీసుకుని వచ్చింది.
దాంతో ఈ యాక్ట్ ను అడ్డం పెట్టుకుని ప్రభుత్వం యాత్రను అడ్డుకునే చాన్స్ ఉందని తమ్ముళ్లు అంచనా వేస్తున్నారు.

ఆయన చిత్తూరు జిల్లా కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకూ ఈ యాత్రను కొనసాగించనున్నారు.దీనికి సంబంధించి టీడీపీ ఇప్పటికే రూట్ మ్యాప్ ను ఖరారు చేసింది.మరో వైపు పవన్ రెండు సినిమాలు పూర్తి చేసి.
ఎన్నికల్లోకి వారాహితో దూకాలని చూస్తున్నారు.నారా లోకేష్ యాత్రను ప్రభుత్వం ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తే.
వెంటనే హై కోర్టు నుంచి పర్మీషన్ తీసుకునేందుకు.టీడీపీ ఒక కమిటీనే ఏర్పాటు చేసింది.

యాత్రలో ఎక్కడైనా వైసీపీ నేతలు గొడవలకు దిగితే.వాటిని న్యాయస్థానం దృష్టికి తీసుకు పోయేందుకు కూడా ఒక యంత్రాంగాన్ని క్రియేట్ చేసుకున్నారు.ఒక అన్ని క్లియరెన్సులతో యువశక్తి ప్రారంభం అయితే.టీడీపీలో నయా జ్యోష్ వస్తుందని భావిస్తున్నారు.మరి తెలుగు తమ్ముళ్లు బావించినట్టు.టీడీపీకీ ఊతం వస్తుందా.? లేక ఉన్న కేడర్ ను జనసేన చీల్చుకుని పోతుందా చూడాలి.







