అందరిదీ వైసీపీ బాటేనా ? బీజేపీ పై చిన్న చూపు ఎందుకో ?

ఏపీలో బలపడేందుకు బీజేపీ చేయని ప్రయత్నం అంటూ లేదు.

గతంకంటే ఆ పార్టీ బలం పుంజుకున్నట్టుగా కనిపిస్తోంది, ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీని దాటుకుని వెళ్లేలా కనిపిస్తోంది.

వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో బాగా బలపడి అధికారం చేజిక్కించుకునే స్థాయి వరకు ఎదగాలనే లక్ష్యంతో ముందుకు వెళ్లేలా కనిపిస్తోంది.బీజేపీ ప్రస్తుత లక్ష్యం కూడా అదే.అందుకే పార్టీలోనే ఉంటూ అనుమానాస్పదంగా ఉన్న నాయకులందరిని పక్కన పెట్టేసి, కొత్త టీమ్ తో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పార్టీని ముందుకు తీసుకువెళ్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటంతో, తమకు కలిసి వస్తుందని, పెద్దఎత్తున నాయకులు బీజేపీలో చేరతారు అని, క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ సహకారంతో బలపడవచ్చు అనే విధంగా బీజేపీ అభిప్రాయపడుతుండగా, వాస్తవంలోకి వచ్చేసరికి బీజేపీ అంచనాలు అన్నీ తలకిందులు అవుతున్నాయి.

ముఖ్యంగా చేరికల విషయంలో ఆ పార్టీ తీవ్ర అసంతృప్తికి గురవుతున్నట్లుగా కనిపిస్తోంది.ప్రస్తుతం ఏపీలో టీడీపీ నుంచి పెద్ద ఎత్తున వలసలు మొదలయ్యాయి.ఆ పార్టీకి రాజకీయ భవిష్యత్తు ఉండదు అనే అభిప్రాయం ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకుల్లో ఉండడంతో ఇప్పుడు వారంతా తమ రాజకీయ భవిష్యత్తుకు ఎటువంటి దొఖా లేకుండా చేసుకునేందుకు ఇప్పుడు అధికార పార్టీ వైసీపీలోకి వచ్చి చేరుతున్నట్టుగా కనిపిస్తున్నారు.

అయితే బీజేపీలోకి వస్తారు అనుకున్న నాయకులు సైతం ఇప్పుడు తమ పంథా మార్చుకుని, వైసిపి బాట పడుతుండటం, బీజేపీ నేతలకు మింగుడు పడటం లేదు.

Advertisement

ముఖ్యంగా విశాఖ జిల్లా రాజకీయాల్లో కీలకంగా ఉన్న గంటా శ్రీనివాసరావు బీజేపీలో చేరితే, బీజేపీ మరింతగా బలం పుంజుకుంటుందని, గంటా చేరికతో ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ ఆ ప్రభావం కనిపిస్తుంది అని, ఆ పార్టీ అంచనా వేయగా, ఆయన మాత్రం ఇప్పుడు వైసీపీలో చేరేందుకు సిద్ధం అవుతుండడంతో బీజేపీలో ఆందోళన కలిగిస్తోంది.మిగతా ఎమ్మెల్యేలు, నాయకులంతా వైసీపీలోకి వెళ్లేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు తప్ప, బీజేపీ లోకి వచ్చేందుకు ముందుకు రాకపోవడంతో, పార్టీని ఏపీలో ఏ విధంగా బలోపేతం చేయాలనే విషయంపై అంతా సందిగ్ధంలో పడిపోయినట్టుగా కనిపిస్తున్నారు.

రానున్న రోజుల్లోనూ బీజేపీలోకి వలస వచ్చే నాయకులే కనిపించకపోవడం , అంతా వైసీపీ బాటే పడుతుండడంతో, ఈ విషయంలో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. 2019 ఎన్నికల తర్వాత కేవలం కొంతమంది నాయకులు మాత్రమే బీజేపీ లోకి రావడం, అది కూడా వైసీపీలోకి వెళ్లేందుకు అవకాశం లేని నాయకులు మాత్రమే బీజేపీలోకి వచ్చారు.ఇప్పుడు పూర్తిగా అవి ఆగిపోవడంతో ఏపీలో పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలనే విషయం అర్థం కాక, ఆ పార్టీ రాష్ట్ర నాయకులు సతమతమవుతున్నట్లుగా కనిపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు