పాదయాత్ర చేస్తున్న జగన్ అడుగులు వృధా కావడంలేదు.అవి విజయానికి బాటలుగా మారుతున్నాయి.
పాదయాత్ర ఫలితమే మారేదన్న కారణమో తెలియదు కానీ గతం కంటే ఇప్పుడు వైసీపీపై జనాల్లో ఒకరకమైన సదభిప్రాయం ఏర్పడింది.అన్ని జిల్లాలో చేసిన పాదయాత్ర కంటే తూర్పుగోదావరి జిల్లాలోకి వచ్చేటప్పటికి రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ కి ఏదో తెలియని ఆదరణ పెరిగినట్టు కనిపిస్తోంది.
సరిగ్గా అదే సమయంలో అధికార టీడీపీ పై జనాల్లో వ్యతిరేకత కూడా బాగా కనిపిస్తోంది.టీడీపీ ప్రజాకర్షక పథకాలు ఎన్ని ప్రవేశపెట్టినా ఆ పార్టీ పై జనాల్లో వ్యతిరేకత కనిపిస్తూనే ఉంది.
ఇక పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీ ని కూడా ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదు.ఇవన్నీ ఎవరో చెప్తున్నవి కాదు ఇటీవల కొన్ని సంస్థలు చేపట్టిన సర్వే ఫలితాలు.
టీడీపీ కంచుకోటలాగా గోదావరి జిల్లాలోనే కాదు వైసీపీ కి బాగా పట్టు ఉండే రాయలసీమలోనూ ఆ పార్టీ గతంకంటే ఇప్పుడు బలం బాగా పుంజుకుంది.టీడీపీ నుంచి వైసీపీలోకి చేరేందుకు నాయకులు కూడా క్యూ కడుతున్నారు.
జగన్ హవాకి అడ్డుకట్ట వేయడం చంద్రబాబు వలన కూడా కావడంలేదు.అదే సమయంలో అయన కుమారుడు లోకేష్ పార్టీకి చేటు తెచ్చేలా ఎక్కడ ఏమి మాట్లాడాలో తెలియక నవ్వులపాలవుతూ పార్టీ పరువు తీస్తున్నాడు.
సోషల్ మీడియాలో టీడీపీ పరువు తీయడానికి లోకేష్ ప్రసంగాలను వాడేసుకుంటున్నారు.ఇవన్నీ వైసీపీకి బాగా కలిసొస్తున్నాయి.
ఉత్తరాంధ్రలో కూడా అధికార పార్టీ నుంచి వలసలు జోరుగానే ఉన్నాయి.వైఎస్ ఆర్ సిపిలోకి క్షేత్రస్దాయిలో చేరికలున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.ఇక నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం కుటుంబ సభ్యులు ఇప్పటికే వైసీపీ తీర్దం పుచ్చుకుంటున్నట్టు సమాచారం.అటు బీజేపీ నుంచి కూడా వలసలు ప్రారంభమయ్యాయి.
ఉత్తరాంధ్రలో జనసేన అధ్యక్షుడు పర్యటించినా అక్కడడక్కడా కొన్ని చేరికలు జరిగినా పెద్దగా పేరున్న నాయకులు ఎవరూ ఆ పార్టీలో చేరలేదు.ఇవన్నీ వైసీపీకి కలిసొచ్చే అంశాలే.
దానికి అనుగుణంగానే జగన్ కూడా తన ప్రసంగాల్లో స్థానిక సమస్యల మీద ఎక్కువగా ఫోకస్ చేసి ప్రజల అభిమానాన్ని పొందుతున్నాడు.టీడీపీ చేయించిన సర్వేల్లో కూడా జగన్ కి అనుకూలంగా ఉన్నట్టు తేలడంతో బాబులో మరింత కంగారు పెరిగింది.







