ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల దగ్గర పడే కొలది రకరకాల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.ఈ క్రమంలో ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి జాయిన్ అవుతున్న నాయకుల సంఖ్య పెరుగుతూనే ఉంది.
ఇదే సమయంలో కొంతమంది నాయకులు వేరే పార్టీలోకి వెళ్తున్నట్లు ప్రచారాలు కూడా జరుగుతున్నాయి.ఈ రకంగానే మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ నాయకుడు.
మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ( Konakalla Narayana ) వైసీపీ లోకి వెళ్తున్నట్లు ప్రచారం జరుగుతూ ఉంది.ఈ క్రమంలో ఆ ప్రచారాన్ని తాజాగా కొనకళ్ల ఖండించారు.
ఆ వార్తలని అవాస్తవమని చెప్పారు.కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
వైసీపీలో ( YCP ) చేరే ఆలోచన లేదని స్పష్టం చేశారు.వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ( TDP ) గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.ఇలాంటి ఫేక్ న్యూస్ వల్ల మా క్రెడిబిలిటీ దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు.వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు.
గతంలో బందరు నుంచి రెండుసార్లు ఎంపీగా కొనకళ్ల నారాయణ గెలవడం జరిగింది.అయితే ఈసారి ఎన్నికలకు సంబంధించి పొత్తులో భాగంగా ఎంపీ టికెట్ జనసేనకి( Janasena ) కేటాయించే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు వార్తలు వచ్చాయి.
దీంతో కొనకళ్ల వైసీపీ నేతలతో టచ్ లోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతూ ఉండటంతో అదంతా ఫేక్ అని కొనకళ్ల క్లారిటీ ఇచ్చారు.