టీడీపీ నేత బుద్దా వెంకన్న కామెంట్స్.గుడివాడలో కొడాలి నాని అనుచరులు రెవిన్యూ ఉద్యోగి పై దాడి చేయడం దారుణం.
గుడివాడ లో మాజీ మంత్రి నాని ఒక నియంత లా, గుడివాడలో ఓ డేరా బాబా లా ప్రవర్తిస్తున్నాడు గతంలో పేకాట క్లబ్ లు పెడితే పోలీసులు కనీసం చర్యలు తీసుకోలేదు, బయట్నుంచి పోలీసులు రావాల్సి వచ్చింది.రెవిన్యూ అధికారులు నాని అనుచరులు దాడి చేసినట్లు గుర్తించి చర్యలు తీసుకుంటే అక్కడికి కేవలం ఒక్క కానిస్టేబుల్ ను మాత్రమే పంపించారు.
గుడివాడలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయింది అక్కడ ఉన్న పోలీసులకి మాములు ఇచ్చి పొలీస్ వ్యవస్థను నాని గుప్పిట్లో పెట్టుకున్నారు గుడివాడలో నాని ఆధ్వర్యంలో ఎన్నో అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నారు.
ఇలాంటి నాయకులపై జగన్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ?జగన్ పాలనలో ఏ ఒక్క అధికారికి రక్షణ లేకుండా పోయింది.గుడివాడ పక్క నియోజకవర్గంలో మంత్రి కూడా మట్టి మాఫియా తో కోట్లు కొల్లగొడుతున్నారు.కొడాలి నాని అంటే జగన్ కు భయమా అనే సందేహం ప్రజలకు కలుగుతోంది.
ప్రతీ దాంట్లో కమిషన్ కొట్టి వందల కోట్లు సంపాదిస్తున్నారు రెవిన్యూ ఉద్యోగి పై దాడి ని టీడీపీ ఖందిస్తోంది, ఉద్యోగ సంఘాలకు టీడీపీ అండగా ఉంటుంది.గుడివాడ లో జరిగిన కుంభకోణాల మీద వెంటనే కమిషన్ వేయాలి, సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలి.
నాని, అతని అనుచరులపై కఠిన చర్యలు తీసుకోవాలి.వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగులకు భద్రత లేదు.
ఉద్యోగ సంఘాలన్నీ ఏకం కావాలి, ఉద్యోగులంతా పెన్ డౌన్ చేస్తే ప్రభుత్వం దిగి వస్తుంది







