రాష్ట్రాన్ని సీఎం వైఎస్ జగన్ ఆఫ్గానిస్థాన్ గా మార్చేశారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు విమర్శించారు.వైసీపీ గూండాలు చంద్రబాబు ఇంటిపై దాడికి ప్రయత్నించడం దారుణమని ఖండించారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవనడానికి ఈ ఘటనే నిదర్శనమని ఫ్యాక్షన్ రాజకీయాలకు అలవాటు పడిన జగన్ ఏపీని ఆఫ్గానిస్థాన్ గా మార్చేశారని మండిపడ్డారు.వైసీపీ నేతలు తాలిబాన్లు మించిపోయారని వైసీపీ ప్రభుత్వం అరాచక పాలన పై ప్రతిపక్షంగా మాట్లాడటం తప్పా.? ప్రజా సమస్యలపై నిలదీస్తే గుండాగిరి చేస్తారా.? అని ధ్వజమెత్తారు.వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ ను అరెస్టు చేసి కేసు నమోదు చేయాలని లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన దిగుతామని హెచ్చరించారు.టీడీపీ గెలుపును ఎవరూ ఆపలేరు అని టీడీపీ నేత బుద్ధ వెంకన్న చెప్పారు.
శుక్రవారం టీడీపీ జాతీయ కార్యాలయం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ప్రజా సమస్యలపై చర్చించాల్సిన క్యాబినెట్ లో ప్రశాంత్ కిశోర్ (పీకే) టీం ఎన్నికల్లో పార్టీ గెలుపొందేందుకు పై చర్చించడం సిగ్గుచేటన్నారు.వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఫోటో పెట్టుకుంటే చాలని టీడీపీ అభ్యర్థులు అంతా గెలుస్తారని చెప్పారు.
అబద్ధపు హామీలు తో ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ ను రాష్ట్రాన్ని బీహార్ కంటే వెనకబడిలా చేశారని విమర్శించారు.మిగిలిన రెండున్నరేళ్లలో రాష్ట్రం ఎడారిగా మారడం ఖాయం అన్నారు కార్మికులకు భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా చేశారన్నారు.

రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు.ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఇంటిపై దాడికి ప్రయత్నించడం వైసీపీ నేతల బరితెగింపు చర్యలకు నిదర్శనమని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఖండించారు.రెండున్నరేళ్లుగా అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, స్పీకర్ మాట్లాడే భాష తో పోలిస్తే అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు ఒక్క శాతం కూడా తప్పు లేదన్నారు.ఒక్కరోజైనా వైసీపీ నేతల బాష పై, వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి పశ్చాత్తాపం వ్యక్తం చేశారా.!? అని ప్రశ్నించారు.వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి పశ్చాత్తాపం వ్యక్తం చేసి ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటే అప్పుడు అయ్యన్న వ్యాఖ్యలను వెనక్కి తీసుకునేందుకు ఆలోచిస్తారన్నారు.