మ‌రో నాలుగు రోజులు.. టీడీపీకి ప‌ని దొరికిందా.. వైసీపీ స‌టైర్లు..!

అధికార పార్టీ వైసీపీకి.ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ మ‌రోసారి అడ్డంగా దొరికింది.

ప్ర‌స్తుతం వైసీపీ సోష‌ల్ మీడియా వింగ్‌లో ఆస‌క్తిక‌ర కామెంట్ల‌తో టీడీపీపై సటైర్లు పేలుతున్నాయి.

`` మ‌రో నాలుగు రోజులు .టీడీపీకి పండ‌గే ``, `` ఓ నాలుగు రోజులు టీవీలు బంద్ చేసుకోండి.ప్ర‌జ‌లారా ?  లేకుండా మీ చెవులు చిల్లు ప‌డ‌డం ఖాయం ``, `` ఇక‌, మాట‌ల బాబు మ‌రో.విశ్వ‌రూపం చూడాల్సిందే.! ``- అంటూ.కామెంట్లు ప‌డుతున్నాయి.

ఇవి భారీ ఎత్తున వైర‌ల్ అవుతుండ‌డం కూడా గ‌మ‌నార్హం.ఇంత‌కీ విష‌యం ఏంటి? అనే ఆలోచ‌న చేస్తే.ఆస‌క్తిక‌ర విష‌యం వెలుగు చూసింది.

అమ‌రావ‌తి రాజ‌దాని కోసం ప్రారంభ‌మైన ఉద్య‌మానికి మ‌రో నాలుగు రోజుల్లో ఏడాది పూర్త‌వుతుంది.ఈ నేప‌థ్యంలో ఈ ఉద్య‌మాన్ని ప‌తాక స్థాయికి చేర్చేందుకు టీడీపీ నేత‌లు భారీ ఎత్తున ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకున్నారు.

Advertisement

రాష్ట్ర వ్యాప్తంగా దీపాలు వెలిగించ‌డం, రాజ‌ధానిలో అమ‌రావ‌తిపై షార్ట్ మూవీల ప్ర‌ద‌ర్శ‌న‌, చంద్ర‌బాబు స‌హా కీల‌క నాయ‌కుల ప్ర‌సంగాల‌ను ప్ర‌సారం చేసే కార్య‌క్ర‌మాల‌కు టీడీపీ డిజిట‌ల్ వింగ్ పెద్ద ఎత్తున ప్ర‌ణాళిక‌లు సిద్దం చేసింది.

ఇక‌, చంద్ర‌బాబు ఈ ఏడాది ఉద్య‌మంపై దాదాపు ఓ నాలుగు గంట‌ల పాటు సోదాహ‌ర‌ణంగా ప్ర‌సంగిస్తున్నార‌ని ఇక్క‌డ రైతుల‌కు వాట్సాప్ సందేశాలు కూడా వ‌చ్చాయి.అంతేకాదు.చంద్ర‌బాబు త‌న ప్ర‌సంగంలో ప్ర‌స్తావించాల‌ని అనుకుంటున్న అంశాల‌ను కూడా సేక‌రిస్తున్నారు.

ప్ర‌స్తుతం రాజ‌ధాని గ్రామాలు స‌హా టీడీపీ అనుకూల మీడియాల్లోనూ అమ‌రావ‌తి ఉద్య‌మానికి ఏడాది అనే అంశంపై పెద్ద ఎత్తున చ‌ర్చ సాగుతోంది.ఏయే అంశాల‌ను ప్ర‌దానంగా చ‌ర్చ‌కు తీసుకువెళ్లాల‌ని అటు టీడీపీ, దాని అనుకూల మీడియా కూడా చ‌ర్చ‌లు చేప‌ట్టాయి.

ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.ఈ విష‌యం సోష‌ల్ మీడియాలో స‌టైర్ల‌కు దారితీసింది.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
కడప ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు..!!

ఇక‌, చంద్ర‌బాబు ఇప్ప‌టికే గంట‌ల త‌ర‌బ‌డి మాట్లాడుతున్న తీరుకు పార్టీలోనే నేత‌లు విసిగిపోతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది.ఇక‌, అమ‌రావ‌తి ఉద్య‌మానికి ఏడాది పూర్తి అవుతోన్న నేప‌థ్యంలో ఆయ‌న త‌వ్వితీసే ఏపీ చ‌రిత్ర‌, త‌న సీఎం అనుభ‌వాలు.

Advertisement

చెప్పుకుంటూ పోవ‌డం ఖాయ‌మ‌ని.దీంతో చెవుల‌కు చిల్లులు ప‌డ‌డం ఖాయ‌మంటూ.

వైసీపీ సోష‌ల్ మీడియాలో వ్యంగ్యాస్త్రాలు జోరుగా సాగుతున్నాయి.ఓ వైపు అమ‌రావ‌తి ఉద్య‌మం అనేది అస‌లు న‌డిచిందా ? అన్న సందేహాలు కూడా వ్య‌క్త‌మ‌వుతున్నాయి.ఈ ఉద్య‌మం ప్రారంభ‌మైన నెల రోజులు మాత్రం కాస్త మూమెంట్ క‌నిపించినా.

ఆ త‌ర్వాత అమ‌రావ‌తి విష‌యాన్ని రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా స్థానికంగా కూడా ప్ర‌జ‌లు మ‌ర్చిపోయారు.ఇలాంటి టైంలో అమ‌రావ‌తి ఉద్యమానికి యేడాది అంటూ టీడీపీ, చంద్ర‌బాబు హ‌డావిడి చేసినా అది ప్ర‌జ‌లు ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేదు.

తాజా వార్తలు