నిగ్గదీస్తూ... నిలదీస్తుంటే... నీళ్లు నములుతున్నారే ...?     2019-01-10   13:37:00  IST  Sai Mallula

ఎన్నికల సమయం దగ్గరకు వచ్చేస్తున్న సమయంలో ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు జన్మభూమి కమిటీల పేరుతో తెలుగుదేశం పార్టీ ఓ కార్యక్రమం రూపొందించింది. అయితే ఇదంతా పార్టీకి బాగా కలిసి వస్తుంది అని టీడీపీ భావించగా… అది కాస్తా రివర్స్ అటాక్ ఇస్తున్నట్టు కనిపిస్తోంది.

TDP Gets Aposed In Andhra Pradesh Over Janmabhoomi Program-Chandrababu Naidu Chinthakayala Chinarappa Program Pawan Kalyan Janasena YCP YS Jagan

TDP Gets Aposed In Andhra Pradesh Over Janmabhoomi Program

ఇప్పటివరకు తమ సమస్యల కోసం ఇళ్ళ చుట్టూ తిరిగినా పట్టించుకోని నాయకులు నేరుగా తమకు అందుబాటులోకి వచ్చి అన్నీ పరిష్కరిస్తామని అనడంతో ప్రజలు ఏకంగా అనేక సమస్యలతో వెంటపడి మరీ నిలదీస్తున్నారు. ఈ విధంగానే విశాఖ జిల్లాలో జన్మభూమి సభల్లో ప్రజలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మంత్రులు, అధికారులు కూడా నీళ్లు నమలడం టీడీపీని డైలమాలో పడేసింది.

TDP Gets Aposed In Andhra Pradesh Over Janmabhoomi Program-Chandrababu Naidu Chinthakayala Chinarappa Program Pawan Kalyan Janasena YCP YS Jagan

ఇప్పుడు ఎన్నికల సమయం కాబట్టి ఇలా మా ముందుకు వచ్చి ఇంకేం కావాలి అంటూ అడుగుతున్నారని… కానీ గతంలో అనేకమార్లు జరిగిన జన్మభూమిలో మేము పెట్టుకున్న అర్జీల సంగతి ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు.

మీరు అధికారంలోకి వచ్చి దాదాపు నాలుగున్నరేళ్ల దాటినా మా సమస్యలు ఏవీ తీరలేదని..మీరు ఎప్పటికప్పుడు హామీలు ఇచ్చి వూరుకున్నారంటూ ఏకంగా మంత్రి గంటా శ్రీనివాసరావు మీద ఆయన సొంత నియోజకవర్గంలో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.పేరుకు జన్మ భూమి కానీ ఎక్కడ సమస్యలు తీర్చడం లేదంటూ రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల జన్మభూమి సభలు రసాభాసగా మారడంతో టీడీపీ డైలమాలో పడింది. ఇదేదో తమకు కలిసి వస్తుంది అంటుకుంటే… ఉన్న పరువుకు ఎసరుపెట్టేలా కనిపిస్తోందని టీడీపీ అధినాయకత్వం భావిస్తోంది.

అలాగే… మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తమ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన వారి మీద ఆగ్రహం వ్యక్తం చేయడంతో… జన్మభూమి కమిటీ సభ రసాభాస అయ్యింది. పించన్లు అడిగిన ఓ మహిళను మంత్రి దూషించి పరువు పోగొట్టుకున్నారు. మాజీ మంత్రి పెందుర్తి సీనియర్ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి కి కూడా దాదాపు ఇదే చిక్కు ఎదురయ్యింది. వరుస వరుసగా జన్మభూమి కమిటీల్లో ఈ విధమైన చిక్కుముడి ఎదురవ్వడం టీడీపీ మీద వ్యతిరేకత ఏ స్థాయిలో పెరిగిపోయిందో తెలియజేస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీ పరిస్థితిపై బాబు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటికే ఇంటలిజెన్స్ రిపోర్ట్స్ వ్యతిరేకంగా రావడం రేపు భవిష్యత్తు ఎలా ఉంటుందో అనే టెన్షన్ టీడీపీలో కనిపిస్తోంది.