తెలంగాణాకు చెందిన టీడీపీ రాజ్య సభ ఎంపీ గుండు సుధా రాణి గులాబీ పార్టీలో చేరడానికి అంతా సిద్ధమైందని వార్తలు వస్తున్నాయి.ఈ నెల 29 తేదీన ముఖ్యమంత్రి కెసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకుంటారు.
ఇలాంటి కప్పు గంతులు మన రాజకీయాల్లో సాధారణమే .కాబట్టి సుధా రాణి వెళ్లి పోవడం విశేషం కాదు.కానీ ఆమెకు కారు పార్టీ ఏమి ఆశ చూపింది? ఏదో ఒక ప్రయోజనం లేనిదే రాజకీయ నాయకులు పార్టీ మారారు కదా.మరి సుధా రాణికి ఏమి ఇస్తామని ఆశ చూపించారో.ప్రస్తుతం ఆమె రాజ్య సభ సభ్యురాలు.ఆ పదవి కాలం ముగిసిన తరువాత మళ్ళీ పెద్దల సభకు నామినేట్ చేస్తామని హామీ ఇచ్చారా? లేదా ఇంకా ఏదైనా పదవి ఇస్తామని వాగ్దానం చేశారా? అయితే గులాబీ పార్టీ ఏం ప్రయోజనం కల్పిస్తుందో బయటకు తెలిసే అవకాశం లేదు.వరంగల్ లోక్ సభ నియోజక వర్గానికి ఉప ఎన్నిక జరగబోతున్న సమయంలో అదే జిల్లాకు చెందిన సుదారాణిని పసుపు పార్టీ నుంచి బయటకు లాగడం విశేషమే.ఇది టీడీపీకి నష్టమే.
గులాబీ పార్టీలోకి వెళ్ళాలా, వద్దా అనేది ఇంకా నిర్ణయించుకోలేదని సుధా రాణి చెబుతున్నారు.చేరేదాకా ఇలాగే అంటారు.







