కృష్ణా జిల్లా, గన్నవరం నియోజకవర్గం: బాపులపాడు మండలం తిప్పనగుంట లో బాదుడే బాదుడు కార్యక్రమం లో పాల్గొన్న దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, నుజీవీడు టి.డి.
పి ఇంచార్జీ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, గన్నవరం టి.డి.పి.ఇంచార్జీ బచ్చుల అర్జునుడు నాయకులు కార్యకర్తలు.చింతమనేనీ కామెంట్స్… 3 సంవత్సరం కాలం లో రాష్ట్ర ప్రజలు వద్దు అనుకున్న ముఖ్యమంత్రి ఉన్నాడు అంటే ఈ జగన్ మోహన్ రెడ్డి మాత్రమే.ప్రజలకి కుడి చేత్తో డబ్బులు ఇచ్చి ఎడమ చేతి తో వడ్డీ తో సహా లాక్కునే ముఖ్యమంత్రి ఈ జగన్ మోహన్ రెడ్డి.
ఆటో వాళ్ళకి సంవత్సరం కి 10000 ఇచ్చి ప్రతి బైక్ కో 5000 వేలు రూపాయలు ఫైన్ వేసి వసూలు చేసే ఘనత జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఉంది.మద్యం, కరెంట్ బిల్లు, పన్నులు రూపంలో పేద ప్రజలను బాదుడే బాదుడు.
జగన్ మోహన్ రెడ్డి 26 మంది ఎం.పి లను ఇస్తే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్త అని చెప్పి ఇప్పుడు బలం చాలదు అని దొంగ మాటలు చెపుతున్నాడు ఈ జగన్.పోలవరం ప్రాజెక్టు పెద్ద ప్రాజెక్టు ఐపోయింది అని నా వల్ల కాదని వదిలేసేడు.జగన్ మోహన్ రెడ్డి హిట్లర్ లాంటి నియంత.వల్లభనేని వంశీ కి సీటు ఇచ్చిన తల్లి లాంటి తెలుగుదేశం పార్టీ పైన భువనేశ్వరిపైన దుర్బాషలాడెడు.ఇలాంటి వాడిని చిత్తు చిత్తుగా ఓడించి నియోజక వర్గం లోనే కాదు రాష్ట్రం నుండి తరిమికొట్టాలి.
వీడితో పాటు పక్కనే ఉన్న గుడివాడ వేదవని కూడా ఓడించి రాష్ట్రం నుండి తరిమికొట్టాలి.ఏ పార్టీ తరపున వచ్చిన వీళ్ళని ఓడించే సత్తా మన తెలుగు దేశం పార్టీ కి ఉందని అన్నారు.
గోరంట్ల మాధవ్ తను చేసిన తప్పుని కప్పిపుంచుకొనేవిధంగా టి.డి.పి పార్టీ మీద నిందలు వేస్తున్నాడు.తను గతంలో పోలీస్ అని ఇప్పుడు ఆ తెలివితేటతో వాడుతున్నాడు.
గోరంట్ల మాధవ్ నోరు అదుపులో పెట్టుకో మాట్లాడు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నావ్ నువ్వే ఏమైనా అందగాడివా నిన్ను మాఫింగ్ చేసి వీడియో చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది.నేను ఒక పార్లమెంట్ సభ్యుడిని అని మర్చిపోయాడు.
దొంగ పోలీస్ ఒకటే కాబట్టి హోమ్ మినిస్టర్ కూడా ఏమి మాట్లాడటం లేదు.హోమ్ మినిస్టర్ అంటే రాష్ట్ర శాంతి భద్రతలతో కాపాడే బాధ్యత వుంటది కానీ ఈ హోమ్ మినిస్టర్ ఇంట్లో పనులు చేసుకోవడమే.
ఎస్సీ ఎస్టీ వాలకి మంత్రు పదవులు ఇచ్చాము అని గొప్పలు చెప్పి తక్కువ చూపు చూస్తూ అధికారం మొత్తం జగన్ మోహన్ రెడ్డి చేతిలో పెట్టుకొని ఆడుకుంటున్నాడు.సజ్జల రామకృష్ణ ఇచ్చిన స్క్రిప్ట్ తప్ప ఏ మంత్రికి గానీ ముఖ్యమంత్రి రెండు మూడు సార్లు చదువుకొని మాట్లాడటం తప్ప ఎవరికీ ఏమీ తెలియదు.
రాష్ట్ర న్ని 50 సంవత్సరం కాలం ఎన్నక్కి తీసుకు వెళ్లిన ఘనత జగన్ మోహన్ రెడ్డి కి దక్కింది.అసెంబ్లీ లో చంద్రబాబు నాయుడు సవాల్ చేసి బయటకు వచ్చి మళ్ళీ ముఖ్యమంత్రి అవి వస్త అని అన్నాడు మనం దాన్ని మనం గెలుపుంచుకొనీ ఆయన మాట నిలబెట్టాలి అని అన్నారు.