తెలంగాణాలో టీడీపీ కనుమరుగేనా ? కేసీఆర్ వ్యూహం ఇదేనా ?

టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ వ్యూహాలు ఎవరికీ అంతుపట్టవు.తాను అనుకున్నది ఏదైనా సరే జరిగేవరకు నిద్రపోడు.

కేసీఆర్ పంతం పట్టినా ఆ విధంగా అంతు తేల్చేస్తాడు.ఇప్పుడు తెలంగాణ టీడీపీ విషయంలో కూడా కేసీఆర్ ఆ విధంగానే పంతం పట్టాడు.

తెలంగాణాలో పసుపు జెండా అనేది కనబడకుండా చేయాలి అనేది కేసీఆర్ ఆలోచన.తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు టీఆర్ఎస్ పార్టీ లక్ష్యంగా అన్ని పార్టీలను ఏకం చేసి మహా కూటమి ఏర్పాటు చేయడం అన్ని పార్టీలు కలిసి సీట్లు పంచుకుని మరీ ఎన్నికలకు వెళ్లడం కేసీఆర్ కు రుచించలేదు.

ఇక ఎన్నికల ఫలితాల తరువాత తెలంగాణ లో టీడీపీ కేవలం రెండంటే రెండు సీట్లకే పరిమితం అయిపొయింది.అయినా తెలంగాణాలో టీడీపీ ఉనికే కనబడకుండా చేయాలని కేసీఆర్ కంకణం కట్టుకున్నాడు.

Advertisement

ప్రస్తుతం తెలంగాణ లో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడంలేదు.అనూహ్యంగా తీసుకున్న ఈ నిర్ణయంతో అక్కడ టీడీపీ క్యాడర్ లో తీవ్ర అసంతృప్తి రగిల్చింది.

పోటీకి అభ్యర్థులను పెట్టడం వలన టీఆర్ఎస్ కి మేలు జరుగుతుందనీ, అందుకే ఈసారి పోటీ చెయ్యకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతున్నామని తెలంగాణ టీడీపీ నేతలు చెబుతున్నారు.టీఆర్ఎస్ ను ఓడించేందుకు ఇదొక వ్యూహం అన్నట్టుగా టీ టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నా ఇక్కడ పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరకడంలేదు అనేది అందరికి తెలిసిన నిజం.

ఇదే అవకాశంగా భావిస్తున్న టీఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బలంగా ఉన్న టీడీపీ నేతలకు గాలం వేస్తోంది.ఈ ఆపరేషన్ కు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్,మాధవరం క్రిష్ణారావు రంగంలోకి దిగినట్టు ప్రచారం మొదలయ్యింది.గ్రేటర్ లో టీడీపీ నగర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న శ్రీనివాస్ ను టీఆర్ఎస్ లో చేర్చుకున్నారు.

అలాగే సనత్ నగర్ నుంచి టీడీపీ అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన వెంకటేష్ గౌడ్, సికింద్రాబాద్ కి చెందిన టీడీపీ నేత సారంగపాణి తదితరులకు కూడా గులాబీ కండువా వేసేసారు.ఇదే వ్యూహంతో రాష్ట్రంలో టీడీపీకి బలమైన కింది స్థాయి నేతల్ని పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలోనే పార్టీలోకి తీసుకుని రావాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ అధినేత ఉన్నాడు.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం.. బాబుకు భలే షాకిచ్చారుగా!
Advertisement

తాజా వార్తలు