గుడివాడ లో చంద్రబాబు ! నేటి రోడ్ షో పై టెన్షన్ టెన్షన్ 

తమను అదేపనిగా ఇబ్బంది పెడుతూ, విమర్శలతో విరుచుకుపడుతున్న వైసిపి కీలక నాయకులను టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) టార్గెట్ చేసుకున్నారు.ఈ మేరకు వైసిపికి కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా పర్యటనలు చేస్తున్నారు.

 Tdp Chandrababu Naidu Raod Show In Mla Kodali Nani Constituency Gudivada Details-TeluguStop.com

ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో వైసిపి కంచుకోటలను బద్దలు కొట్టాలనే ఆలోచనతో చంద్రబాబు ఉన్నారు.ఈ మేరకు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రస్తుతం పర్యటనలు చేస్తున్నారు.

నిన్ననే మాజీ మంత్రి మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించారు.

ఈరోజు మరో కీలక నేత, తనపై తరచూ వ్యక్తిగత విమర్శలతో విరుచుకుపడుతూ, కంటిలో నలుసులా మారిన కొడాలి నాని( Kodali Nani ) నియోజకవర్గమైన గుడివాడలో ( Gudivada ) చంద్రబాబు ఈరోజు రోడ్ షో తో పాటు , సభను నిర్వహించబోతున్నారు.

నిన్న  చంద్రబాబు రోడ్ షో బందరులో జరిగింది.ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు వైసీపీ ప్రభుత్వం ను టార్గెట్ చేసుకుని విమర్శలు చేశారు. 

Telugu Ap, Chandrababu, Chandrababuroad, Gudivada, Jagan, Machilipatnam, Mla Kod

బటన్ నొక్కి జగన్ 2 లక్షల కోట్లు బొక్కేశారని విమర్శలు చేశారు.పులివెందులలో బస్టాండ్ కట్టలేని వ్యక్తి మూడు రాజధానులు కడతాడా అని ప్రశ్నించారు.ఈ సందర్భంగా పేర్ని నానితో పాటు,  గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పైన విమర్శలు చేశారు.ఈరోజు గుడివాడలో చంద్రబాబు పర్యటన ఉన్న నేపథ్యంలో వైసిపి కూడా ఎదురుదాడికి దిగేందుకు ప్రయత్నించే అవకాశం ఉండడంతో చంద్రబాబు పర్యటనపై ఉత్కంఠ నెలకొంది.

రాబోయే ఎన్నికల్లో గుడివాడ,  గన్నవరం నియోజకవర్గాల్లో ఎట్టి పరిస్థితుల్లోనైనా గెలవాలనే పట్టుదలతో చంద్రబాబు ఉన్నారు.

Telugu Ap, Chandrababu, Chandrababuroad, Gudivada, Jagan, Machilipatnam, Mla Kod

ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల తర్వాత చంద్రబాబు గుడివాడ నియోజకవర్గంలోని నిమ్మకూరులో ఎన్టీఆర్ శత జయంతి సభలో పాల్గొంటారు.  ఆ తర్వాత బస్టాండ్ సెంటర్,  నెహ్రూ చౌక్ , గుడివాడ బైపాస్ మీదుగా చంద్రబాబు రోడ్ షో నిర్వహించబోతున్నారు.  అలాగే గుడివాడలో చంద్రబాబు పాదయాత్ర కూడా చేపట్టనున్నారు.

  విజయవాడలోని వీకేఆర్ కాలేజీ గ్రౌండ్స్ లో బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు.అయితే ఎప్పుడూ చంద్రబాబు ను టార్గెట్ చేసుకునే కొడాలి నాని చంద్రబాబు సభ, రోడ్ షో కు ఎటువంటి జలక్ ఇస్తారు అనేది సంచలనంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube