జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Janasena Pawan Kalyan ) నాలుగో విడత వారాహి యాత్రను కృష్ణాజిల్లా నుంచి ప్రారంభించనున్నారు.ఐదు రోజులపాటు ఈ వారాహి యాత్ర కొనసాగునుంది.
ఈరోజు ప్రారంభం కానున్న ఈ యాత్రకు టిడిపి పూర్తిగా మద్దతు తెలిపింది.ఇప్పటికే జనసేన, టిడిపిలు అధికారికంగా పొత్తు పెట్టుకోవడం , వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకోవడంతో ఇప్పటి నుంచే రెండు పార్టీలు కలిసి ఉమ్మడిగా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించుకున్నాయి.
దీనిలో భాగంగానే పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర( Pawan Kalyan Varahi Yatra )లో టిడిపి క్యాడర్ కూడా పాల్గొనాలని నిన్న జరిగిన టిడిపి కీలక సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టు తరువాత పార్టీ వ్యవహారాలను ముందుకు తీసుకు వెళ్లేందుకు పొలిటికల్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేశారు.

ఈ కమిటీ సమావేశం ను నంద్యాలలో చంద్రబాబు అరెస్టు( Chandrababu Arrest ) చేసిన ప్రాంతంలో నిర్వహించారు.ఈ సమావేశంలో నందమూరి బాలకృష్ణ కూడా పాల్గొన్నారు.ఈ సందర్భంగా అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు.ఇక ఈ సమావేశం ముగిసిన తర్వాత నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) వారాహి యాత్రకు సంపూర్ణ మద్దతును ప్రకటించారు .జనసేన ,టిడిపి కలిసి పోరాటాలు చేసేందుకు ,, వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సమన్వయం చేసుకునేందుకు కమిటీని కూడా ఏర్పాటు చేశారు.పవన్ వారాహి యాత్రలో పెద్ద ఎత్తున టిడిపి క్యారెక్టర్ కూడా పాల్గొని ఆ యాత్రను విజయవంతం చేయాలని ఇప్పటికే కేడర్ కు పిలుపునిచ్చార.

ఇక రెండు పార్టీలు రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు ఉమ్మడిగా చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నాయి.అయితే టిడిపి, జనసేన పొత్తు( TDP Janasena Alliance )ను రెండు పార్టీల్లోని కొంతమంది నాయకులు వ్యతిరేకిస్తూ ఉండడం, సోషల్ మీడియాలోనూ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా పోస్టింగ్స్ పెడుతూ ఉండడం తదితర అంశాల పైన ఈ రెండు పార్టీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి.పార్టీ విధానాలను పట్టించుకోకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తున్న పార్టీ నాయకులను పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నారు వారితో తమ పార్టీలకు సంబంధం లేదనే విధంగా నిర్ణయం తీసుకున్నాయి.ఇక పవన్ వారాహి యాత్ర లో టీడీపీ శ్రేణులు కూడా పాల్గొనబోతూ ఉండడంతో మంచి కనిపించనుంది.