మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని( Nallamilli Ramakrishna Reddy ) టీడీపీ అధిష్టానం బుజ్జగించే పనిలో పడింది.ఈ మేరకు నల్లమిల్లితో టీడీపీ నేతల బృందం( TDP Leaders ) భేటీ అయింది.
టీడీపీ అధిష్టానం ఆదేశాల మేరకు పార్టీ కీలక నేతలు బుచ్చయ్య చౌదరి,( Buchchaiah Chowdary ) సుజయ కృష్ణారంగారావు( Sujaya Krishna Rangarao ) నల్లమిల్లితో చర్చలు జరిపారు.
ఈ క్రమంలోనే నల్లమిల్లిని తీసుకురమ్మని చంద్రబాబు( Chandrababu ) తమను పంపించారని సుజయ కృష్ణారంగారావు అన్నారు.
అయితే రెండు రోజుల్లో వస్తానని నల్లమిల్లి చెప్పారని సుజన తెలిపారు.అదేవిధంగా చంద్రబాబు బీజేపీతో చర్చించి సీటు మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన వెల్లడించారు.