గెలుపే లక్ష్యంగా టీడీపీ పోత్తుల రాజకీయాలు?

ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.అన్ని పార్టీలు 2024లో గెలుపే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్నాయి.

 Tdp Alliance Politics Aimed At Winning Chandra Babu Naidu-TeluguStop.com

ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం ఇప్పటికే జనాల్లోకి వెళ్లింది.అధినేత చంద్రబాబు నాయుడు బాదుడే బాదుడు పేరుతో జిల్లాల పర్యటన చేపట్టారు.

ఓ వైపు ప్రభుత్వం వ్యతిరేక విధనాలను ప్రజలకు వివరిస్తున్నారు.అదే సమయంలో.

ఆయా జిల్లాల్లో నిస్తేజంగా ఉన్న కేడర్‎లో జోష్ నింపుతున్నారు.అధినేత రాకతో ఆయా జిల్లాల్లో పార్టీ లెక్కలు మారే అవకాశం కూడా కనిపిస్తోంది.

పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కూడా సైకిల్ యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్లనున్నారు.అలాగే నిన్నటి వరకు పార్టీలో నాయకులు ఉన్నా.వారంతా ఇన్ యాక్టివ్‎గా ఉండేవారు.అలాంటి నేతలను స్వయంగా కలిసిన చంద్రబాబు.

క్లాస్ పీకడంతో.అంతా మళ్లీ జనం బాట పడుతున్నారు.

పూర్తి యాక్టివ్ ఇక అవుతున్నారు.కొన్నిచోట్ల సీట్లపైనా ఆయన స్పష్టమైన హామీ ఇస్తున్నారని టాక్.

దీంతో ఆయా నియోజకవర్గాల్లో వారంతా ఫుల్ జోష్ తో కనిపిస్తున్నారు.

Telugu Ap Poltics, Bjp, Chandra Babu, Janaseena, Pawan Kalyan, Tdp Alliance, Ys

రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికే సీఎం జగన్ కంకణం కట్టుకున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు.రాష్ట్ర పరిస్థితిని చూస్తే ఆవేదన కలుగుతుందన్నారు.కాకినాడ జిల్లా అన్నవరంలో టీడీపీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా… క్విట్ జగన్… సేవ్ ఆంధ్రప్రదేశ్ అని ఆయన పిలుపునిచ్చారు.రాష్ట్రంలో ఆడబిడ్డలపై అత్యాచారాలు జరుగుతున్నా చేతగాని ప్రభుత్వం ఏమీ చేయలేకపోతోందన్నారు.

పైగా హోంశాఖ మంత్రి తల్లుల పెంపకంపై మాట్లాడటం సిగ్గుచేటన్నారు.సజ్జల రాసిన స్టేట్ మెంట్లనే ఆమె చదువుతున్నారని ఎద్దేవా చేశారు.

రాష్ట్ర పునర్ నిర్మాణం కోసం అందరూ ఉద్యమించాలన్నారు.టీడీపీ హయాంలో ఐటీ ఉద్యోగాలు ఇచ్చి కోట్ల రూపాయలు సంపాదించే అవకాశం కల్పిస్తే… జగన్ మాత్రం వాలంటీరు ఉద్యోగాలుఇచ్చి 5 వేల రూపాయలు బిచ్చమేస్తున్నారని ఆరోపించారు.

మరోవైపు టీడీపీ అధినేత పిలుపుకు.జనసేన నుంచి సైతం సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయి.జనసేన నేత మనోహర్ సైతం చంద్రబాబు తరహాలోనే ప్రతిపక్షాలు కలవాల్సిన అవసరాన్ని ప్రస్తావిస్తున్నారు.ప్రభుత్వం నుంచి కలుగుతున్న నష్టాన్ని పూడ్చేందుకు అందరూ కలసి పనిచేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేసారు.

పరోక్షంగా చంద్రబాబు వ్యాఖ్యలను సమర్ధించారు.టీడీపీ.

జనసేన ద్వితీయ శ్రేణి నేతలు రెండు పార్టీలు కలిసి పని చేయాలని కోరుకుంటున్నారనే చర్చ రెండు పార్టీల్లోనూ ఉంది.బీజేపీ కంటే టీడీపీతోనే రాజకీయంగా భవిష్యత్ బాగుంటుందనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube