ఏపీలో రీపోలింగ్ రచ్చ చేస్తున్న రీపోలింగ్ గొడవ! వైసీపీకి ఈసీ సహకరిస్తుందా

దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల్లు తుది దశకి వచ్చేసాయి.ఈ సమయంలో ఎన్నికల సంఘం ఊహించని విధంగా ఏపీలో చంద్రగిరి నియోజకవర్గంలో ఐదు స్థానాలలో రీపోలింగ్ జరిపించాలని నిర్ణయించింది.

 Tdp Allegations On Election Commission About Re Poling Issue-TeluguStop.com

అయితే ఇప్పుడు ఈ రీపోలింగ్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య రచ్చ చేస్తుంది.కొద్ది రోజుల క్రితం ఏపీలో జరిగిన రీపోలింగ్ కేంద్రాలలో కూడా వైసీపీ పార్టీ ఫిర్యాదుల నేపధ్యంలోనే జరిగాయి.

మరోసారి కూడా వైసీపీ ఫిర్యాదు నేపధ్యంలోనే చంద్రగిరిలో రీపోలింగ్ కి ఎలక్షన్ కమిషన్ సిద్ధమైంది.

అయితే ఈ రీపోల్లింగ్ వ్యవహారం టీడీపీ పార్టీకి అస్సలు మింగుడు పడటం లేదు.

తాము 19 కేంద్రాలలో అవకతవకలు జరిగాయని అక్కడ రీపోలింగ్ జరిపించాలని ఈసీకి ఫిర్యాదు చేస్తే దానిని అస్సలు పరిశీలించని ఎలక్షన్ కమిషన్ వైసీపీ వారు చెప్పగానే రీపోలింగ్ నిర్వహించడం చూస్తుంటే ఇదేదో కుట్రపూరితంగా జరుగుతున్నట్లు కనిపిస్తుందని టీడీపీ ఆరోపణ.కేంద్రంలో ఉన్న బీజేపీ కనుసన్నల్లో నడుస్తున్న ఎలక్షన్ కమిషన్ వైసీపీ పార్టీ నేతలు ఏం చెబితే అది చేస్తూ గంగిరెద్దులా వ్యవహరిస్తుంది అని విమర్శిస్తున్నారు.

అయితే ఎన్నికలు జరిగిన 25 రోజుల తర్వాత చంద్రగిరిలో ఐదు సెంటర్స్ లో రీపోలింగ్ జరపాలని వైసీపీ ఫిర్యాదు చేయడం, ఎలక్షన్ కమిషన్ 40 రోజుల తర్వాత రీపోలింగ్ జరిపించడానికి సిద్ధం అవడం చూస్తుంటే దీని వెనుక ఏదో కుట్ర ఉండే ఉంటుంది అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube