సౌత్ ఇండియా నుంచి అరుదైన గుర్తింపు సొంతం చేసుకున్న మహేష్ బాబు

టాలీవుడ్ లో స్టార్ నెంబర్ వన్ స్టార్ హీరోగా తనకంటూ గుర్తింపు సొంత చేసుకున్న సూపర్ స్టార్ మహేష్ ఈ మధ్య కాలంలో రొటీన్ కి భిన్నంగా కొత్త కథలని ఎంచుకుంటూ సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నారు.ఇప్పటికే భరత్ అనే నేను, తాజాగా మహర్షి సినిమాలతో వరుసగా రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకున్న మహేష్ బాబు సౌత్ హీరోలలో అందరి కంటే అందగాడు అనే విషయం అందరికి తెలిసిందే.

 Super Star Mahesh Babu One More Achievement-TeluguStop.com

అమ్మాయిల డ్రీమ్ బాయ్ గా ఉన్న మహేష్ బాబుకి సౌత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

మహేశ్‌ బాబు తాజాగా మరో అరుదైన గుర్తింపు సొంతం చేసుకున్నాడు.

ప్రఖ్యాత ‘టైమ్స్‌ మోస్ట్‌ డిజైరబుల్‌ ఫరెవర్‌-2018 జాబితాలో మహేశ్‌ బాబుకు స్థానం కల్పించారు.ఇప్పటి వరకు ఈ జాబితాలో సల్మాన్‌ ఖాన్‌, షారుక్‌ ఖాన్‌, అక్షయ్‌ కుమార్‌, ఆమీర్‌ ఖాన్‌ వంటి బాలీవుడ్‌ స్టార్‌ హీరోలు మాత్రమే ఉన్నారు.

ఇప్పుడు సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు కూడా ఆ లిస్టులో చోటు దక్కించుకున్నారు.ప్రతిసారి మహేష్‌ మోస్ట్‌ డిజైరబుల్‌ జాబితాలో ఆయన పేరును ఫరెవర్‌ డిజైరబుల్‌ క్లబ్‌లో చేర్చేశారు.

ఇప్పటివరకు ఏ దక్షిణాది హీరోకి ఈ గౌరవం లభించలేదు.మొత్తానికి మహేశ్ బాబు కెరియర్ లో ఇది మరో అరుదైన ఘనత అని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube