ఏపీలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న టీడీపీ తీరు చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.తప్పు ఎవరూ చేసినా తప్పే అవుతుందన్న విషయాన్ని గ్రహించలేకపోతున్నారట.
అగ్రరాజ్యం అమెరికా( America )లో హ్యుమన్ ట్రాఫికింగ్ ఘటనపై టీడీపీ రాద్దాంతం చేస్తున్న సంగతి తెలిసిందే.అమెరికాలో హ్యుమన్ ట్రాఫికింగ్( Human trafficking ) చేస్తున్నాడన్న ఆరోపణల నేపథ్యంలో ఏపీకి చెందిన సత్తారు వెంకటేశ్ రెడ్డి అనే వ్యక్తిని సెయింట్ లూయిస్ పోలీసులు అరెస్ట్ చేశారు.
అనంతరం ఆయనపై హ్యుమన్ ట్రాఫికింగ్ తో పాటు పలు నేరాల కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.ఇరవై ఏళ్ల యువకుడిని చదువు పేరుతో అమెరికాకు తీసుకు వచ్చి ఇంటిలో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారంటూ సత్తారు వెంకటేశ్ రెడ్డిపై ఆరోపణలు వస్తున్నాయి.
ఈ క్రమంలో స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సత్తారు వెంకటేశ్ రెడ్డితో పాటు మరో ఇద్దరినీ అరెస్ట్ చేశారు.

అయితే ఈ ఘటనను అడ్డు పెట్టుకుని టీడీపీ నానా రాద్దాంతం చేస్తుంది.గతంలో ఇదే అమెరికాలో టీడీపీకి చెందిన పలువురు వ్యక్తులు ఇటువంటి తరహాలో దాడులకు పాల్పడిన ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయన్న సంగతి దాదాపు ప్రతి ఒక్కరికి తెలిసిందే.హ్యుమన్ ట్రాఫికింగ్ తో పాటు సినీతారలతో సెక్స్ రాకెట్ వంటి పలు వ్యవహారాల్లో టీడీపీ( TDP )కి చెందిన నాయకులు ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి మర్చిపోయారా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది.
అయితే వాళ్ల నాయకులు ఎన్ని ఘటనలకు పాల్పడిన చూసి చూడనట్లు వ్యవహారించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మాత్రం హంగామా చేస్తుందంటున్నారు ఏపీ ప్రజలు.టీడీపీకి చెందిన నేతలపై ఆరోపణలు వచ్చినప్పుడు పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu naidu ) కానీ ఇతర ముఖ్యనేతలు కానీ ప్రశ్నించిన దాఖలాలు లేవంటూ ధ్వజమెత్తారు.
కనీసం వారిని పార్టీ నుంచి కూడా తొలగించలేకపోయిందని మండిపడ్డారు.

మరోవైపు హ్యుమన్ ట్రాఫికింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వెంకటేశ్ రెడ్డి( Venkatesh Reddy )కి, పార్టీకి ఎటువంటి సంబంధం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ స్పష్టం చేసింది.ఈ ఘటనను వైసీపీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొంది.ఈ కేసులో ఉన్న సత్తారు వెంకటేశ్ రెడ్డి చేసిన నేరం వ్యక్తిగతమన్న వైసీపీ చట్టం తన పని తాను చేసుకుని పోతుందని వెల్లడించింది.