పథకం ప్రకారమే వైసీపీపై టీడీపీ ఆరోపణలు..!!

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం చేస్తూ పాలన కొనసాగిస్తుంది.అయితే ప్రతిపక్షాలు మాత్రం కుట్ర పూరితంగా జగన్ సర్కార్ పై బురద జల్లే ప్రయత్నం చేస్తూనే ఉంటాయన్న సంగతి తెలిసిందే.

 Tdp Allegations Against Ycp According To Plan..!!-TeluguStop.com

ఈ క్రమంలోనే తాజాగా కేంద్రం నుండి డిప్యూటేషన్ పై రాష్ట్రానికి వచ్చే ఐఏఎస్ అధికారులను సైతం వదల్లేదని తెలుస్తోంది.ఐఏఎస్ అధికారులంతా సీఎం జగన్ సామాజిక వర్గానికి చెందిన వారే ఎక్కువగా ఉన్నారంటూ కొత్త అంశాన్ని తెరపైకి తీసుకువచ్చింది.

పక్కా ప్రణాళిక ప్రకారం వైసీపీ ప్రభుత్వంపై కక్ష పూరితంగా టీడీపీ నేతలు బురద జల్లుతున్నారు.దాన్ని కొన్ని మీడియా సంస్థలు సైతం నిజమని నమ్మించడానికి చేసే ప్రయత్నాలపై ఏపీ ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు.

సీఎం జగన్ సామాజిక న్యాయం పాటించడం లేదని అనవసర ఆరోపణలు చేస్తున్నారని చెబుతున్నారు.కేంద్రం నుంచి వచ్చే ఐఏఎస్ అధికారుల్లో ఎక్కువగా సీఎం సామాజికవర్గం వారే ఉన్నారని, వీరంతా అవినీతి చేయడానికి ఆస్కారం ఉన్న శాఖలు అప్పగించారని అనుచిత వ్యాఖ్యలు చేయడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నిజాలను పక్కన పెట్టేసి ఇటువంటి అసత్య ప్రచారాలు చేయడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో జరిగిన అన్యాయాల గురించి ఏనాడూ మాట్లాడని కొన్ని మీడియా సంస్థలు.

ఇప్పుడు మాత్రం పెద్ద పెద్ద కథనాలు ప్రసారం చేయడంపై పలువురు విమర్శలు చేస్తున్నారు.ఏపీలో సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత జరుగుతున్న అభివృద్ధి కానీ, పేద ప్రజలకు జరుగుతున్న మంచి, అందుతున్న సంక్షేమ పథకాలను చూడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది.

అంతేకాకుండా చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన అధికారులు ఎంతో మంది వచ్చిన సంగతి తెలిసిందే.ఈ విధంగా జాస్తి కృష్ణకిశోర్, సంధ్యారాణి, రాజమౌళి, సాంబ శివరావు ఇలా ఎందరో ఏపీ క్యాడర్ కు వచ్చారన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే.

అప్పుడు మాట్లాడని వారు ఇప్పుడు జగన్ ను విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని పలువురు చెబుతున్నారు.

రాష్ట్రంలోని వైసీపీని ఎదుర్కొనే దమ్ము లేక ఈ విధంగా విషం చిమ్ముతూ వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని అర్థం అవుతుందని కొందరు అంటున్నారు.

వచ్చే ఎన్నికల్లో ఎక్కడా ఓడిపోతామోనన్న భయంతో పిచ్చి రాతలు, పిచ్చి వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది.అయితే టీడీపీ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా… ఎంత బురద జల్లేందుకు ప్రయత్నించినా ప్రజలు నమ్మేస్థితిలో లేరని సమాచారం.

ఈ క్రమంలోనే తమకు మంచి చేసిన జగన్ కే మరోసారి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube