ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్న ? బాబు అసలు ప్లాన్ ఇది !

టీడీపీ అధినేత చంద్రబాబు తెలివితేటలు ఒక పక్కన ఎవరికీ అర్థం కాదు.తిమ్మిని బమ్మి చేసైనా, పార్టీకి మేలు కలిగే విధంగా చంద్రబాబు చేయగలగడంలో దిట్ట.

ప్రస్తుతం టీడీపీ నాయకులు అంతా తీవ్ర భయాందోళనలో ఉన్నారు.అధికార పార్టీ కేసులతో వేధింపులకు దిగుతోందని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు వ్యవహరించినా, అరెస్టులు చేస్తోందంటూ, టీడీపీ పిలుపు ఇస్తున్నా, పోరాటాలు చేసేందుకు ముందుకు రావడం లేదు.

ఈ పరిస్థితుల్లో పార్టీ పరిస్థితి అదుపు తప్పుతుందని, ఇకపై తాను ఎంతో కాలం యాక్టివ్ గా రాజకీయాలు చేయలేనని, ఈ సమయంలో పార్టీ బాధ్యతలు సమర్థవంతమైన నాయకులకు అప్పగించకపోతే టీడీపీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందనే అభిప్రాయానికి చంద్రబాబు వచ్చేసారు.ఈ నేపథ్యంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి, చెక్కిలి టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్న నాయుడును నియమించేందుకు కసరత్తు మొత్తం పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

అచ్చెన్న టీడీపీ అధ్యక్షుడు కాబోతున్నాడని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్నా, అది కార్యరూపం దాల్చలేదు.కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పార్టీని ముందుకు ఆయనే తీసుకు వెళ్ళగలరని చంద్రబాబు బలంగా నమ్ముతున్నారు.

Advertisement

ప్రస్తుత టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా ఉన్న కళా వెంకటరావు పనితీరు అంతంతమాత్రంగానే ఉండడం, ఆయన మెతక వైఖరితో ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు వెనుకాడటం, ఇవన్నీ బేరీజు వేసుకుని చంద్రబాబు నాయుడు అచ్చెన్న అయితేనే పార్టీని సమర్థవంతంగా ముందుకు తీసుకు వెళ్లగలరని, ప్రభుత్వంపై రాజీలేకుండా పోరాటం చేయగలరని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.ఈ మేరకు టీడీపీ ఆఫీస్ నుంచి మీడియాకు లీకులు అందాయి.

మరికొద్ది రోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తి చేసి అచ్చెన్న ద్వారా వైసీపీ ప్రభుత్వం పై పోరాడాలని బాబు ప్లాన్ చేసుకుంటున్నారు.అసలు టీడీపీ ఏపీ అధ్యక్షుడు గా శ్రీకాకుళం ఎంపీ కేంద్ర రామ్మోహన్ నాయుడుని నియమించాలని చూసినా, ఆయన రాజకీయ అనుభవం పెద్దగా లేకపోవడంతో, మొండి వాడిగా, బలమైన గొంతు ఉన్నవాడిగా అన్ని అర్హతలు ఉన్న వాడిగా అచ్చెన్న నాయుడు చంద్రబాబు దృష్టిలో పడటంతో, ఇప్పుడు ఏపీ టీడీపీ అధ్యక్ష పదవి ఆయన్ను వరించబోతోంది.

Advertisement

తాజా వార్తలు