టార్గెట్ రేవంత్‌రెడ్డి... శ‌త్రువులంద‌రూ చేతులు కలిపారే...!

తెలంగాణ తొలి అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌కు, అధికార టీఆర్ఎస్‌కు కొర‌క‌రాని కొయ్య మాదిరిగా త‌యారైన రేవంత్‌రెడ్డిని గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ అధిష్టానం ప‌ని క‌ట్టుకుని మ‌రీ ఓడించింది.

మంత్రి హ‌రీష్‌రావుతో పాటు మ‌రో అర‌డ‌జ‌ను మంది మంత్రులు కొడంగ‌ల్‌పై ప్ర‌త్యేకంగా కాన్‌సంట్రేష‌న్ చేసి మ‌రీ రేవంత్‌ను ఓడించారు.

కింద స్థాయి నేత‌ల‌ను బెదిరించ‌డం, భ‌య‌పెట్ట‌డం, ప్ర‌లోభ పెట్ట‌డంతో పాటు రేవంత్ అనుచ‌రుల‌ను అనేకానేక విధాలుగా త‌మ వైపున‌కు తిప్పుకుని రేవంత్‌ను అసెంబ్లీలోకి రాకుండా చేశారు.అయితే రేవంత్ ఆ వెంట‌నే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో మ‌ల్కాజ్‌గిరి నుంచి హోరాహోరీ పోరులో విజ‌యం సాధించి ఈ సారి ఏకంగా లోక్‌స‌భ‌లో ఎంట్రీ ఇచ్చారు.

రేవంత్ తాను ఎక్క‌డ ఉన్నా పోరాటాల యోధుడినే అని ఫ్రూవ్ చేసుకున్నారు.అయితే ఇప్పుడు గ్రేట‌ర్ ఎన్నిక‌ల వేళ రేవంత్ మ‌రోసారి టార్గెట్ అవుతోన్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

మ‌ల్కాజ్‌గిరి ఎంపీ సీటు పూర్తిగా హైద‌రాబాద్‌ను ఆనుకుని ఉంఉంది.ఇదంతా సెటిల‌ర్లు ఎక్కువుగా ఉండే ప్రాంతం కావ‌డంతో రేవంత్‌కు పార్టీల‌తో సంబంధం లేకుండా ఓట్లు వేసి ఆయ‌న్ను ఎంపీగ గెలిపించారు.

Advertisement

ఇప్పుడు గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో ఈ నియోజ‌క‌వ‌ర్గంలో రేవంత్ స‌త్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు.ఈ క్ర‌మంలోనే రేవంత్‌ను టీఆర్ఎస్ మ‌రోసారి టార్గెట్ చేసింది.రేవంత్ ప్ర‌ధాన అనుచ‌రులుగా ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న వారంద‌రిని పార్టీలోకి ప్ర‌లోభాలు, భ‌య‌పెట్టి ఆహ్వానిస్తోంది.

ప‌లు వ్యాపారాలు ఉన్న‌వారు కొంద‌రు, రాజకీయ భ‌విష్య‌త్తు కోసం మ‌రికొంద‌రు త‌ప్ప‌నిస‌రిగా రేవంత్‌కు దూరం అవుతోన్న ప‌రిస్థితి ఉంది.గ్రేట‌ర్లో మ‌ల్కాజ్‌గిరి ప‌రిధిలోనే కాస్తో కూస్తో కాంగ్రెస్ స్ట్రాంగ్‌గా ఉండ‌డంతో ఇక్క‌డ రేవంత్‌ను ఢీ కొట్టేందుకు టీఆర్ఎస్‌, బీజేపీ ఉమ్మ‌డిగా చేతులు క‌లిపి మ‌రీ ఆప‌రేష‌న్ రేవంత్ చేస్తున్నాయి.

రేవంత్ అనుచ‌రుల్లో కొంద‌రు టీఆర్ఎస్‌లోకి.మ‌రికొంద‌రు బీజేపీలోకి వెళుతున్నారు.ఇక కాంగ్రెస్‌లో రేవంత్ శ‌త్రువులు కూడా వీరికి స‌హ‌క‌రిస్తున్నార‌ట‌.

ఇదే విష‌యంపై రేవంత్‌రెడ్డి వ‌ర్గం మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతోంది.రేవంత్ పీసీసీ అధ్య‌క్ష రేసులో ఉండ‌డంతో సొంత పార్టీలోనే కొంద‌రు శ‌త్రువులు ఇత‌ర పార్టీల‌కు రేవంత్‌ను టార్గెట్ చేసే విష‌యంలో లోపాయికారిగా స‌హ‌క‌రిస్తున్నాయి.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
ఈ ఎండలేంట్రా బాబోయ్ .. ! 

మ‌రి ఈ ప‌ద్మ‌వ్యూహం రేవంత్ ఎంత వ‌రుక చేధిస్తాడో ?  చూడాలి.

Advertisement

తాజా వార్తలు