టాలీవుడ్ పై ఆశలు వదిలేసి ఇష్టానుసారంగా కామెంట్స్‌ చేస్తోంది

మంచు మనోజ్( Manoj Manchu ) హీరోగా పరిచయం అయినా ఝుమ్మంది నాదం సినిమా( Jhummandi Naadam movie )తో ముద్దుగుమ్మ తాప్సి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన విషయం తెలిసిందే.హీరోయిన్గా తాప్సికి అది మొదటి సినిమానే అయినా కూడా మంచి గుర్తింపు లభించింది.

 Tapsee Comments On Tollywood , Tapsee, Manoj Manchu, Jhummandi Naadam Movie, Soc-TeluguStop.com

సొట్ట బుగ్గల సుందరి అంటూ ప్రేక్షకులు తాప్సి ని ఆదరించారు.తెలుగు లో స్టార్ హీరోలకు జోడిగా నటించే అవకాశాలు సొంతం చేసుకుంది.

కానీ దురదృష్టవశాత్తు ఆమెకు మంచి సక్సెస్ దక్కలేదు.తెలుగు లో స్టార్ హీరోయిన్ హోదా లభించక పోవడంతో బాలీవుడ్ కి వలస వెళ్లింది.

Telugu Bollywood, Manoj Manchu, Tapsee, Tapsi Pannu, Tollywood-Movie

అక్కడ స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలుగుతోంది.మంచి ఆఫర్స్ హిందీ ఇండస్ట్రీ( Bollywood ) నుండి దక్కించుకుంటున్న తాప్సి( tapsee ) తెలుగు లో మాత్రం అవకాశాలు లేక పోవడంతో పూర్తిగా బాలీవుడ్ కే పరిమితమైంది.తెలుగు సినిమా ఇండస్ట్రీ కి మళ్ళీ వచ్చే ఆలోచన లేక పోవడం వల్లనో ఏమో కానీ ఇష్టానుసారంగా తెలుగు సినిమా పరిశ్రమ గురించి విమర్శలు చేస్తోంది.

Telugu Bollywood, Manoj Manchu, Tapsee, Tapsi Pannu, Tollywood-Movie

తన కెరియర్ ఆరంభంలో చాలా మంది తనను దురదృష్టవంతురాలు అంటూ విమర్శించారని.తాను చేసిన సినిమాలు సక్సెస్ కాక పోవడంతో ఆ నిందలు తనపై వేశారంటూ ఆవేదన వ్యక్తం చేసింది.తాను సినిమా ఇండస్ట్రీకి చెందిన ఫ్యామిలీ నుండి రాలేదని.

అందుకే కెరియర్ ఆరంభంలో సినిమాల ఎంపిక విషయంలో తాను సరైన నిర్ణయాలు తీసుకోలేక పోయానని ఒప్పుకుంది.కానీ ఆ సమయంలో తనను చాలా విమర్శించారని.

నేను నటించడం వల్ల సినిమా లు ఫెయిల్ అయ్యిందన్నట్లుగా కొందరు కామెంట్స్ చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ ని బ్లేమ్‌ చేయడం ఎక్కువగా ఉంటుందని ఆరోపించింది.

ఎలాగో టాలీవుడ్ లో మళ్లీ నటించాలనే ఆసక్తిని ఆమె చూపించడం లేదు… అందుకే తెలుగు సినిమా ఇండస్ట్రీ పై ఇలాంటి విమర్శలు చేస్తుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఇన్నాళ్లు తన మనసులో పెట్టుకున్న ఇండస్ట్రీపై కోపాన్ని ఇప్పుడు బయటకి చూపిస్తుందంటూ కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube