డబ్బులు తీసుకుని ఇంట్లోనుంచి గెంటేశారు. తనికెళ్ల సంచలన వ్యాఖ్యలు?

నటుడిగా, రచయితగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న వాళ్లలో తనికెళ్ల భరణి ఒకరనే సంగతి తెలిసిందే.320కు పైగా సినిమాలలో నటించిన తనికెళ్ల భరణి ఆ సినిమాలలో మెజారిటీ సినిమాలతో సక్సెస్ లను అందుకున్నారు.ఎలాంటి పాత్ర ఇచ్చినా పూర్తిస్థాయిలో న్యాయం చేసే నటుడిగా తనికెళ్లకు పేరుంది.మిథునం అనే సినిమాకు తనికెళ్ల భరణి దర్శకునిగా వ్యవహరించడం గమనార్హం.

 Tanikella Bharani Shocking Comments Goes Viral In Social Media Details Here , S-TeluguStop.com

తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన తనికెళ్ల భరణి ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.చెవిలో పువ్వు ఇ.వి.వి.సత్యనారాయణ రాసుకున్న స్క్రిప్ట్ అని ఆయన తెలిపారు.స్క్రిప్ట్ లో మార్పులు చేయడం ఇ.వి.వి సత్యనారాయణకు నచ్చలేదని ఆయన చెప్పుకొచ్చారు.నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడని ఆ ఫ్రెండ్ నాలో ఉన్న రచనను గుర్తుపట్టి నన్ను ప్రోత్సహించాడని ఆ ఫ్రెండ్ పేరు నరసింహ కుమార్ అని తనికెళ్ల భరణి తెలిపారు.

రాళ్లపల్లి గారి ఇంట్లో నేను, మా ఆవిడ కొత్తగా దిగామని ఆయన ఇంట్లో నాకోసం సపరేట్ గా ఒక రూమ్ ఉండేదని ఆయన చెప్పుకొచ్చారు. భీమరాజు అనే ఫైట్ మాస్టర్ గ్రౌండ్ ఫ్లోర్ ను అమ్మేయాలని అనుకుంటున్నానని నువ్వు తీసుకోవాలని నాకు సూచించాడని ఆయన తెలిపారు.3లక్షల రూపాయలకు 40 సంవత్సరాల క్రితం ఇంటికి ఒప్పందం కుదిరిందని ఆయన కామెంట్లు చేశారు.

Telugu Tarzan, Mithunam, Simha Kumar-Movie

నిదానంగా డబ్బులు ఇవ్వొచ్చని చెప్పడంతో నేను ఓకే చెప్పానని తనికెళ్ల అన్నారు.18 నెలల్లో 2 లక్షల రూపాయలు ఇచ్చానని తనికెళ్ల భరణి తెలిపారు.ఆ తర్వాత డబ్బుల విషయంలో ఒత్తిడి చేసి డబ్బులు ఇవ్వకుండా నన్ను ఇంటినుంచి వెళ్లగొట్టాడని తనికెళ్ల భరణి అన్నారు.ఆ తర్వాత నటుడు టార్జాన్ ను రిక్వెస్ట్ చేసి అతని ద్వారా బెదిరిస్తే మొదట 50,000 రూపాయలు వచ్చాయని ఆ తర్వాత 25,000 రూపాయలు వచ్చాయని తనికెళ్ల భరణి చెప్పుకొచ్చారు.

నా దగ్గర డబ్బులు తీసుకున్న వ్యక్తికి తర్వాత రోజుల్లో పక్షవాతం వచ్చిందని తనికెళ్ల భరణి అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube