నూతన వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో తానేటి వనిత, విజయసాయి రెడ్డి..

విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా నూతన వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభోత్సవం లో పాల్గొన్న జిల్లా ఇంచార్జ్ మంత్రి, హోం మినిస్టర్ తానేటి వనిత.పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి.

 Taneti Vanitha Vijayasai Reddy Ycp Party Office Inauguration In Ntr District Det-TeluguStop.com

స్వాతిరోడ్ సెంటర్ నుండి వైస్సార్సీపీ పార్టీ ఆఫీస్ వరకు ర్యాలీ తో స్వాగతం పలికిన కార్యకర్తలు.గజమాలతో ఘన సన్మానం చేసిన కార్పొరేటర్లు, వైస్సార్సీపీ నాయకులు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, మొండితోక జగన్మోహన్ రావ్, రక్షణనిధి, వసంత కృష్ణ ప్రసాద్, రీజినల్ కో ఆర్డినేటర్ మర్రి రాజశేఖర్, మేయర్ భాగ్యలక్ష్మి, దేవినేని అవినాష్, ఉప్పాల హారిక, ఇతర వైస్సార్సీపీ నాయకులు.నూతనంగా ఏర్పడిన ఎన్టీఆర్ జిల్లాలో పార్టీ ఆఫీస్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్న విజయసాయిరెడ్డి, హోం మినిస్టర్.

ఎన్టీఆర్ జిల్లా లోని అన్ని అసెంబ్లీ స్థానాల గెలుపే లక్ష్యంగా పనిచేస్తామన్న మంత్రులు జిల్లా అభివృద్ధి కోసం నాయకులు అందరం కలిసి పనిచేస్తామన్న జిల్లా ఇంచార్జ్ మంత్రి, హోంమంత్రి తానేటి వనిత.

విజయసాయిరెడ్డి పాయింట్స్.

అన్ని జిల్లాల్లోనూ పార్టీ సొంత కార్యాలయాలు ఏర్పాటు చేస్తాం.ఎన్నికలకు సంవత్సరం ముందే 26 జిల్లాలోనూ అందుబాటులోకి వస్తాయి.

పార్టీ ఆఫీసు అంటే దేవాలయం లాంటిదని మా నమ్మకం.టీడీపీ కుసంస్కారంతో వ్యవహరిస్తోంది.

మావాళ్లని అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు.లోకేష్ కు పుట్టుకతో వచ్చిన సమస్య వలన ఇలా తయారయింది.

నిన్న లోకేష్ జూమ్ మీటింగ్ కి కంసమామ జగన్ అంటూ పేరు పెట్టారు.అంటే ఎంత జుగుప్సాకరమైన వ్యవహారాలు చేస్తున్నారో చూడండి.

అందుకే ప్రశ్నించటానికి మా వాళ్లు వెళ్లారు.తండ్రి కొడుకులు బుద్ది మార్చుకోకపోతే మేము తగిన బుద్ది చెప్తాం.

నిన్నటిది కేవలం ఆరంభం మాత్రమే.రానున్న రోజుల్లో మరింతగా ఎదురుదాడు చేస్తాం.

అందుకే ఇకనైనా పద్దతులు మార్చుకోండి.టెన్త్ ఫెయిల్ అవటానికి కారణాలు తెలుసుకోవాలేగానీ సీఎంని తిట్టాల్సిన పనేంటి? కుసంస్కారంతో మా నాయకులను తిట్టించకుండా వాస్తవాలు తెలుసుకోండి.ప్రజాస్వామ్య పద్దతుల్లో వ్యవహరించండి.లోకేష్ సవాల్ ని స్వీకరిస్తున్నాం.చర్చకు రావాల్సిందిగా కోరుతున్నా.

చంద్రబాబు వచ్చినా సరే చర్చకు మేము సిద్దం.

జూమ్ లో మా ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పారిపోయారు.ఈ ప్రభుత్వం పేద ప్రజలకు వర్తించే కార్యక్రమాలు చేస్తోంది.

అందుకే టీడీపీ కి కడుపుమంట.కుప్పంలో కూడా ఓడిపోయినప్పుడే మాకు 175 గ్యారెంటీగా వస్తాయని నమ్మకం ఉంది.

మీకు దమ్ముంటే ఆత్మకూరులో పొటీ చేసి రెఫరెండం కోరండి.అసలు పప్పునాయుడుకి రెఫరెండం అంటే తెలుసా?.టెన్త్ క్లాస్ పిల్లలు అడిగితేనే వంశీ, కొడాలి నాని, రజని ఎంటర్ అయ్యారు.వాళ్ల మీద సీఐడీకి ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఏంటి?.ఎవరైనా విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని ఉంటే వారింటికి వెళ్లి ఓదార్చాలి.అంతేగానీ రాజకీయాలు చేయటం కరెక్టు కాదు.

బీజేపీ నేతలు తాము ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదో ప్రజలకు చెప్పాలి.మా కార్యకర్తలను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాం.

ఏ నాయకుడూ కార్యకర్తలను వదులుకోలేరు.కార్యకర్తలు, నాయకుల వలనే 2019లో అధికారంలోకి వచ్చాం.

జిల్లా ఇన్ ఛార్జి మంత్రి తానేటి వనిత పాయింట్స్.జిల్లాలో ని ఏడు నియోజకవర్గాల్లో గెలుపు కోసం పని చేస్తాం.ఇన్ఛార్జి మంత్రిగా నావంతు కృషి చెసి గెలుపుకు సహకరిస్తా.మర్రి రాజశేఖర్, జిల్లా కో ఆర్డినేటర్.

కొత్తగా పార్టీ ఆఫీసు ప్రారంభం సంతీషం.నాయకులంతా ఇక్కడ అందుబాటులో ఉంటారు.

కార్యకర్తల సమస్యల కృషికి పనిచేస్తాం.పార్టీ అధినేత జగన్ ఆదేశాల మేరకు పని చేస్తాం.

జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నాయకులతో సమన్వయం చేసుకుంటాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube