నూతన వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో తానేటి వనిత, విజయసాయి రెడ్డి..
TeluguStop.com
విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా నూతన వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభోత్సవం లో పాల్గొన్న జిల్లా ఇంచార్జ్ మంత్రి, హోం మినిస్టర్ తానేటి వనిత.
పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి.స్వాతిరోడ్ సెంటర్ నుండి వైస్సార్సీపీ పార్టీ ఆఫీస్ వరకు ర్యాలీ తో స్వాగతం పలికిన కార్యకర్తలు.
గజమాలతో ఘన సన్మానం చేసిన కార్పొరేటర్లు, వైస్సార్సీపీ నాయకులు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, మొండితోక జగన్మోహన్ రావ్, రక్షణనిధి, వసంత కృష్ణ ప్రసాద్, రీజినల్ కో ఆర్డినేటర్ మర్రి రాజశేఖర్, మేయర్ భాగ్యలక్ష్మి, దేవినేని అవినాష్, ఉప్పాల హారిక, ఇతర వైస్సార్సీపీ నాయకులు.
నూతనంగా ఏర్పడిన ఎన్టీఆర్ జిల్లాలో పార్టీ ఆఫీస్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్న విజయసాయిరెడ్డి, హోం మినిస్టర్.
ఎన్టీఆర్ జిల్లా లోని అన్ని అసెంబ్లీ స్థానాల గెలుపే లక్ష్యంగా పనిచేస్తామన్న మంత్రులు జిల్లా అభివృద్ధి కోసం నాయకులు అందరం కలిసి పనిచేస్తామన్న జిల్లా ఇంచార్జ్ మంత్రి, హోంమంత్రి తానేటి వనిత.
విజయసాయిరెడ్డి పాయింట్స్.అన్ని జిల్లాల్లోనూ పార్టీ సొంత కార్యాలయాలు ఏర్పాటు చేస్తాం.
ఎన్నికలకు సంవత్సరం ముందే 26 జిల్లాలోనూ అందుబాటులోకి వస్తాయి.పార్టీ ఆఫీసు అంటే దేవాలయం లాంటిదని మా నమ్మకం.