టీడీపీ హయాంలో పరిపాలన కొనసాగింది వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆర్టీసీ ఛార్జీల పెంచారు కేంద్ర ప్రభుత్వం ఇంధనంపై సుంకం తగ్గిస్తే.ఇతర రాష్ట్రాలు సుంకాన్ని తగ్గించా కానీ .
మన రాష్ట్రం తగ్గించలేదు ట్యాక్సీ డ్రైవర్లకు 10000 ఇస్తున్నారు, కానీ రాష్ట్రంలోని రోడ్ల వల్ల వారి వాహనాలు గుల్లయిపోతున్నాయి.రిపేర్లకే 50000 ఖర్చు చేస్తున్నారు.
రాష్ట్రంలో రోడ్లవల్ల ఆర్టీసీ బస్సు ఎక్కే వారి వొళ్ళు గుల్ల అయిపోతుంది.జగన్ తన సిమెంట్ ధరలను ,ఇసుక ధరలను అమాంతం పెంచేశారు.
చంద్రబాబు హయాంలో ఉచితంగా ఇసుక ఇచ్చారు ఈ నాడు ఇసుకను జేపీ అనే ప్రయివేట్ సంస్థకు అప్పగించి, సామాన్యులకు ఇసుక అందుబాటులో లేకుండా చేశారు ఇప్పటి వరకు మూడు సార్లు ఇసుక విధానాన్ని ఏర్పాటు చేశారు .అయినా ఇసుక కష్టాలు తప్పడం లేదు ఇప్పుడున్న ధరలతో సామాన్యులకు రోజు గడవడానికే కష్టం గా మారింది.నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించే వరకు టీడీపీ పార్టీ పోరాడుతూ ఉంటుంది.